logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

నేను చెప్పిందే నిజ‌మైంది.. క‌రోనాపై ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

క‌రోనా వైర‌స్ పుట్టుక‌పై అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. క‌రోనా వైర‌స్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే వ‌చ్చింద‌ని తాను అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడే చెప్పాన‌ని, కానీ అప్పుడు ఎవ‌రూ వినిపించుకోలేద‌ని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పుడు శ‌త్రువులు కూడా తాను చెప్పిన మాట‌ల‌నే చెబుతున్నార‌ని ఆయ‌న అన్నారు. ఇంత భారీ విధ్వంసానికి, ఇన్ని మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మైన చైనా.. అమెరికాకు, ప్ర‌పంచ దేశాల‌కు 10 ట్రిలియ‌న్ డాల‌ర్ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని డోనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ఏడాదిన్న‌ర క్రితం చైనాలో క‌రోనా వైర‌స్ పుట్టిన నాటి నుంచి డోనాల్డ్ ట్రంప్ త‌న అనుమానాల‌న్నీ చైనాపైనే వ్య‌క్తం చేశారు. ఇది క‌చ్చితంగా మాన‌వులు సృష్టించిన వైర‌సేన‌ని, వుహాన్‌లోని ల్యాబ్ నుంచే ఈ వైర‌స్ వ్యాప్తి చెందింద‌ని ఆయ‌న ప‌దేప‌దే చెప్పారు. అంతేకాదు, తాను అమెరికా అధ్య‌క్షుడిగా ఉన్న‌న్ని రోజులు ఎప్పుడు క‌రోనా వైర‌స్ గురించి మాట్లాడాల్సి వ‌చ్చినా కూడా దానిని చైనా వైర‌స్ అనే పిలిచేవారు.

అయితే, అప్పుడు ట్రంప్ వాద‌న‌ను ఎవ‌రూ స‌మ‌ర్థించ‌లేదు. ట్రంప్ చెబుతున్న దానికి ఆధారాలు లేవ‌ని డ‌బ్లూహెచ్ఓ కూడా నిర్ధారించింది. అయితే, ఇప్పుడు మాత్రం ట్రంప్ వాద‌న‌కు బలం చేకూరుతోంది. బ్రిట‌న్ స‌హా ప‌లు దేశాల‌కు చెందిన శాస్త్ర‌వేత్త‌లు చేస్తున్న అధ్య‌య‌నాల్లో క‌రోనా వైర‌స్ అనేది మాన‌వ సృష్టేన‌ని అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత వార్తా ప‌త్రికల్లోనూ ఈ విష‌యం ప్ర‌చురిత‌మ‌వుతోంది.

వుహాన్ ల్యాబ్‌లో నుంచే క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందింద‌నే వాద‌న బ‌ల‌ప‌డుతోంది. మ‌రోసారి ఈ అంశం లోతైన విచార‌ణ జ‌ర‌పాల‌నే డిమాండ్ అంత‌టా పెరుగుతోంది. బ‌యోవెప‌న్‌ను సృష్టించే క్ర‌మంలో వుహాన్ ల్యాబ్ నుంచి క‌రోనా వైర‌స్ బ‌య‌ట‌కు వ్యాప్తి చెందింద‌నేది ప్ర‌ధానంగా వ‌స్తున్న ఆరోప‌ణ‌. వుహాన్ మార్కెట్‌లో ఈ వైర‌స్ వ్యాప్తి చెంద‌క ముందే వుహాన్‌లో ల్యాబ్‌లో కొంద‌రు శాస్త్ర‌వేత్త‌లు క‌రోనా వైర‌స్ బారిన ప‌డ్డార‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

అయితే, ఈ వాద‌న‌ల‌ను చైనా ఖండిస్తోంది. తాజాగా ఆ దేశ విదేశాంగ అధికార ప్ర‌తినిధి అయితే ఏకంగా అమెరికాతో పాటు ప‌లు దేశాల నుంచి క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందింద‌ని ఆశ్చ‌ర్య‌క‌ర ప్ర‌క‌ట‌న చేశారు. ఏదేమైనా డోనాల్డ్ ట్రంప్ సుమారు ఏడాది పాటు చేసిన ఆరోప‌ణ‌లు ఇప్పుడు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చాయి. అందుకే ట్రంప్ కూడా మ‌ళ్లీ త‌న వాద‌న‌ను వినిపించారు.

Related News
%d bloggers like this: