logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

అలా జరిగితేనే వైట్ హౌస్ వీడతా.. ట్రంప్ కొత్త మెలిక!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డోనాల్డ్ ట్రంప్ తన ఓటమిని ఒప్పుకోవడానికి అయిష్టత వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట బైడెన్ గెలుపుని తాను అంగీకరించడం లేదని, వైట్ హౌస్ ను వదిలేది లేదన్నాడు. ఆ తర్వాత ఎలాగోలా దిగొచ్చి ఓటమిని అంగీకరించకపోయినా అధికారాన్ని బైడెన్ కు అప్పగించడానికి ఒప్పుకున్నారు.

ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే ట్రంప్ మళ్ళీ మనసు మార్చుకున్నాడు. ఇప్పుడు వైట్ హౌస్ ను వీడేందుకు కొత్త మెలిక పెట్టారు. బైడెన్ గెలుపును ఎలెక్టోరల్ కాలేజీ ధృవీకరించిన తర్వాతనే వైట్ హౌస్ ను ఖాళీ చేస్తానంటున్నారు. అమెరికా ఎన్నికల్లో 50 రాష్ట్రాల్లో 528 ఎలక్టోరల్ ఉన్నాయి.

అధ్యక్ష పదవిని చేపట్టాలంటే 270 ఓట్ల మార్కును దాటవలసి ఉంటుంది. మొన్నజరిగిన ఎన్నికల్లో బైడెన్ కు 306 ఓట్లు రాగా ట్రంప్ కు 232 ఓట్లు పడ్డాయి. ఈ లెక్క ప్రకారం బైడెన్ గెలుపు స్పష్టమవుతుంది. కాగా డిసెంబర్ 14వ తేదీన ఎలక్టోర్స్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎలక్టోర్స్ భేటీ అవ్వనున్నారు.

ఈ వేదికపై బైడెన్ తన గెలుపును నిరూపించుకోవాలంటూ ట్రంప్ సవాలు చేస్తున్నారట. అప్పుడే వైట్ హౌస్ నుంచి కదులుతానని అంటున్నారు. దీంతో ఇప్పుడు 14వ తేదీన జరగబోయే ఈ సమావేశంలో ఎలాంటి పరిణామాలు జరగబోతాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అమెరికన్లు.

 

 

 

 

 

 

 

..

Related News