అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వీరాభిమాని, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుస్సా కృష్ణ గుండెపోటుతో మరణించారు. డోనాల్డ్ ట్రంప్‌కు కృష్ణి వీరాభిమాని. తన ఇంట్లో ట్రంప్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని నిత్యం పూజలు చేస్తుంటారు. ఇవాళ ఉదయం ఆయన గుండెపోటుతో మరణించారు.
అయితే, డోనాల్డ్ ట్రంప్‌పైన బెంగతోనే కృష్ణకు గుండెపోటు వచ్చిందని ఆయన స్నేహితులు చెబుతున్నారు. ట్రంప్‌కి ఇటీవల కరోనా వైరస్ సోకిన నాటి నుంచి కృష్ణ తీవ్ర ఆందోళనతో ఉన్నారని, ఈ క్రమంలోనే ఆయనకు గుండెపోటు వచ్చిందని వారు చెబుతున్నారు. ట్రంప్‌కి కరోనా సోకిన తర్వాత ఆయన కోలుకోవాలని కృష్ణ పూజలు చేస్తున్నారు. ఇటీవల ఆయన ట్రంప్ ఫోటో పట్టుకొని ఏడుస్తున్న వీడియో కూడా వైరల్ అయింది.