logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

నా భార‌తీయ స్నేహితుల‌కు వెంటిలేట‌ర్లు పంపిస్తాం

క‌నిపించ‌ని శ‌త్రువు అయిన క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారిపై పోరాటంలో భార‌త‌దేశానికి, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి అండ‌గా నిలుస్తామ‌ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. నా భార‌తీయ సోద‌రుల‌కు వెంటిలేట‌ర్లు విరాళంగా పంపిస్తాన‌ని ప్ర‌క‌టించారు. క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ త‌యారీలోని భార‌త‌దేశంలో అమెరికా క‌లిసి ప‌ని చేస్తోంద‌ని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ట్వీట్ చేశారు.

మ‌రోవైపు వైట్‌హౌజ్‌లో మాట్లాడుతున్న స‌మ‌యంలోనూ ఆయ‌న వ్యాక్సిన్ త‌యారీకి ఇండియాతో క‌లిసి ప‌ని చేస్తున్న‌ట్లు చెప్పారు. అమెరికాలో భార‌తీయులు పెద్ద సంఖ్య‌లో నివ‌సిస్తున్నార‌ని గుర్తు చేసిన ట్రంప్ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి హ‌లో చెప్పారు. కాగా, ఇటీవ‌ల డోనాల్డ్ ట్రంప్ విజ్ఞ‌ప్తి మేర‌కు ప్ర‌ధాని మోడీ అమెరికాకు హైడ్రాక్సీక్లోరోక్విన్ పంపించిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఎక్కువ‌గా న‌ష్ట‌పోయిన అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు 14.7 ల‌క్ష‌ల మందికి క‌రోనా వైర‌స్ సోక‌గా 88,199 మంది మ‌ర‌ణించారు.

Related News