logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

భారత్ పై మరోసారి ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. అమెరికాలో ఇప్పటి వరకు లక్షకు పైగా కరోనా వైరస్ భారిన పడి మరణించారు. ఈ విషయం పై స్పందిస్తూ అమెరికాలో కన్నా భారత్ లోనే కరోనా కేసులు ఎక్కువ అన్నారు ట్రంప్. హాప్కిన్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. అమెరికాలో ఇప్పటివరకు 1.9 మిలియన్ కరోనా కేసులు, 1,09,000 మరణాలు సంభవించాయి.

ఈ నివేదిక ప్రకారం.. భారత్ లో 2,36,657 కేసులు, 6,642 మరణాలు నమోదయ్యాయి. కరోనా మొదట బయటపడిన చైనాలో 84,177 కేసులు, 4,638 మరణాలు నమోదయ్యాయి. ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికాలో ఇప్పటివరకు 2 కోట్ల మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించాం. కాబట్టే మా దేశంలో కరోనా కేసులు ఎక్కవగా నమోదయ్యాయి. నా దేశ ప్రజలకు కూడా నేను ఇదే విషయాన్ని చెప్పాను. ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తే ఎక్కవ కేసులు బయటకు వస్తాయి.

ఇదే తరహాలో భారత్, చైనా వంటి ఇతర దేశాలలో కరోనా పరీక్షలు నిరవహిస్తే అమెరికా కంటే ఎక్కువ కేసు నమోదవుతాయి. అందుకు నేను హామీ ఇస్తున్నాను అని అన్నారు. జర్మనీ వంటి దేశాలతో పోలిస్తే తమ దేశమే ఎక్కువ టెస్టులు చేయించిందన్నారు. జర్మనీలో ఇప్పటివరకు కేవలం 490 లక్షల మందికి మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహించారని, దక్షిణ కొరియాలో ఈ సంఖ్య 30 లక్షలేనని అన్నారు.

Related News