logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

ట్రంప్ ఓడిపోయాడు.. కరోనానే గెలిచింది..!

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో దేశ ప్రజలంతా మాస్కు వేసుకోవాలని వైట్ హౌస్ ప్రకటించింది. కరోనాను ఎదుర్కోగల అస్త్రం మాస్కు ధరించడం వమాత్రమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం వెల్లడించింది. అన్ని దేశాల అధ్యక్షులు, ప్రధానులు మాస్కు ధరించి తమ ప్రజలకు మార్గదర్శకంగా నిలిచారు. కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించారు.

అమెరికన్లు అందరూ మాస్కు వేసుకోవాలని చెప్పిన ట్రంప్ తాను మాత్రం మాస్కు ధరించనని మొండికేశారు. కరోనా వైరస్ అత్యధికంగా ప్రభావం చూపించిన అమెరికాలో ముందు నుంచీ పౌరులని హెచ్చరించక పోవడం, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చెప్పి అప్రమత్తం చేయడం లాంటివి చేయకపోవడం వల్లనే ప్రస్తుతం భారీ మూల్యం చెల్లించుకుందని ట్రంప్ విమర్శలు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే.

అయితే ట్రంప్ మాస్కు ధరించకపోవడంపై పెద్ద రాద్దాంతమే జరిగింది. అయినా ట్రంప్ అవేమీ లెక్క చేయలేదు. తాను మాత్రం మాస్కు ధరించానని భీష్మించుకు కూర్చున్నాడు. కానీ తాజాగా ట్రంప్ మాస్కు ధరించి బహిరంగంగా అకనిపించి అందరినీ ఆశ్చర్యపరివచ్చారు. ట్రంప్‌ శనివారం మేరీలాండ్‌లో ఓ సైనిక ఆస్పత్రిని సందర్శించిన సందర్భంలో మాస్క్‌ ధరించారు. గాయపడిన సైనికులు, కరోనా ఫ్రంట్ లైన్ వైద్యులను కలిశారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. పెద్ద ఎత్తున సైనికులు, కరోనా రోగులను కలిసే సమయంలో మాస్కు తప్పనిసరి అని, కరోనాను అధిగమించడంలో మాస్కు ధరించడం గొప్ప విషయమని వ్యాఖ్యానించారు.

మాస్కు ధరించడానికి తానెప్పుడూ వ్యతిరేకం కాదని కానీ సమయం, సందర్భం వచ్చినప్పుడు మాస్కును ధరించాలని భావించానన్నారు. ప్రస్తుతం అమెరికాలో అధ్యక్షుల ఎన్నికలకు రంగం సిద్దమైన వేళ మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ ప్రచార కర్తలు ట్రంప్ పై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. తమ నాయకుడు ట్రంప్ లాగా కాదని అందరి కన్నా ముందుగానే మాస్కు ధరించి ప్రజలను చైతన్య పరిచారని వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో అగ్రరాజ్యానికి అధ్యక్షుడైనా.. సామాన్యుడైన కరోనాకు ఒక్కటేనని చివరకు కరోనా ముంగిట ట్రంప్ పంతం నెగ్గలేదంటున్నారు.

Related News