logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

బంతిపై ఉమ్మి కరోనా రూల్ బ్రేక్ చేసిన క్రికెటర్.. అంపైర్లు ఏం చేసారంటే?

కోవిడ్- 19 నిబంధనల ప్రకారం క్రికెటర్లు బంతిపై ఉమ్మివేయడాన్ని నిషేదించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఐసీసీ ఆటలో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. అయితే ఆటగాళ్లు మాత్రం ఇంకా ఈ కొత్త నిబంధనలకు అలవాటు పడలేకపోతున్నారని తెలుస్తుంది. తాజాగా మాంచెస్టర్‌ వేదికగా ఇంగ్లాండ్- వెస్టిండీస్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ ను నిర్వహిస్తున్నారు.

అయితే 2వ టెస్ట్ 4వ రోజు ఆటలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొదటి సారి డామ్ సిబ్లే ఈ రూల్ ను బ్రేక్ చేసాడు. అలవాటులో పొరపాటుగా బంతిపై ఉమ్మేసాడు. నాలుగో రోజు లంచ్‌కు ముందు క్రిస్ ఓక్స్ ఓవర్ పూర్తవగానే.. బంతి సిబ్లే చేతికొచ్చింది. ఇక ఓవర్‌ వేసేందుకు స్పిన్నర్‌ డామ్‌ బెస్ సిద్దమవుతున్నాడు. అనుకోకుండా ఎప్పటిలాగానే బంతిపై ఉమ్మేసాడు. ఈ విషయం గమనించిన ఆటగాళ్లు ఎంపైర్ కు ఆ విషయాన్నీ చేరవేశారు. దీంతో అప్రమత్తమైన అంపైర్ బంతిని శానిటైజర్ తో శుభ్రం చేసి టవల్ తో తుడిచి ఇచ్చాడు.

కొత్తగా వచ్చిన నిబంధనలకు క్రికెటర్లు అలవాటు పడేవరకు సరేగాని ఆ తర్వాత కూడా ఇలాంటివి జరిగితే మాత్రం ఇన్నింగ్స్‌కు రెండు సార్లు హెచ్చరిస్తారు అప్పటికీ వారిలో మార్పు రాకుంటే పెనాల్టీ కింద బ్యాటింగ్‌ జట్టుకు ఐదు పరుగులు జతచేస్తారు. అంటే బౌలింగ్ చేసే జట్టు అందనంగా 5 రన్స్ చేయాల్సి ఉంటుంది. ఇతర దేశాల్లో క్రికెట్ కు అనుమతిస్తే ఇంకెంత మంది ఆటగాళ్లు ఇలా చేస్తారోనని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related News