logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

హైదరాబాద్ లో మహిళా డాక్టర్ నిర్బంధంపై సర్కార్ సీరియస్!

కరోనా రోగులకు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు షాకిస్తున్నాయి. లక్షల్లో బిల్లు వేసి హడలెత్తిస్తున్నాయి. అయితే ఇప్పుడు వైద్యులకు కూడా ఈ కష్టాలు తప్పడం లేదు. తాజాగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఆసుపత్రి బిల్లు కట్టలేదన్న కారణంగా ఓ మహిళా వైద్యురాలిని ఆసుపత్రి యాజమాన్యాలు నిర్బంధించాయి.

నగరంలోని ఫీవర్ ఆసుపత్రిలో డీఎంవోగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సుల్తానా ఈ నెల ఒకటవ తేదీన కరోనా పాజిటివ్ తేలడంతో చాదర్ ఘాట్ లోని తుంబే ప్రైవేట్ ఆసుపత్రిలోచేరారు. కాగా 24 గంటలకు ఆమెకు రూ.1.15 లక్షల బిల్లు వేశారు. దీనిపై ఆమె మండిపడ్డారు. తాను కూడా వైద్యురాలినేనని ఒక్క రోజులు లక్షన్నర బిల్లు ఎలా వేసారో చెప్పాలని నిలదీసింది. దీంతో ఆసుపత్రి యాజమాన్యాలు తనను నిర్బందించాయని ఓ సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వక్తం చేసారు.

కరోనా క్లిష్ట సమయంలో ఫ్రంట్ లైన్లో సేవలు అందించిన తనకు సరైన వైద్యం కూడా అందడం లేదని ఆమె వాపోయారు. ఈ ఘటనపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. డాక్టర్ సుల్తానాను వెంటనే నిమ్స్ కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదివారం ఆదేశాలు ఇచ్చారు.

Related News