logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

వాక్సిన్ ఏ చేతికి వేసుకోవాలి? వేసుకున్న తర్వాత పాజిటివ్ వస్తుందా? కరోనా వచ్చి తగ్గిన వారు ఎప్పుడు తీసుకోవాలి?

సోషల్ మీడియాలో కరోనా, కరోనా వాక్సిన్ లకు సంబందించిన ఎన్నో దుష్ప్రచారాలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. అయితే కరోనా సమయంలో ఇలాంటి దుష్ప్రచారాలు వీలైనంత దూరంగా ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరు వాక్సిన్ వేసుకునేవాయారు పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మే ముందు వాటిని క్రాస్ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో కరోనా, కరోనా వాక్సిన్ లకు సంబందించిన కొన్ని వాస్తవాలు- అపోహలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా వాక్సిన్ ను ఎడమ చేతికి ఇస్తుంటారు. అయితే కుడి చేతికి ఇవ్వరని కాదు. అలా తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు. అందువల్ల వాక్సిన్ ఏ చేతికి తీసుకోవాలనే విషయంలో అయోమయం చెందల్సిన అవసరం లేదు. వాక్సిన్ ఇంజెక్షన్ రూపంలో ఉంటుందన్న విషయం తెలిసిందే. టీకా ఇచ్చిన చోట కొంచెం నొప్పి, మంట లాంటివి ఉంటె ఆ భాగాన్నిచేతితో రుద్దటం, ఐస్ క్యూబులను ఉంచడం లాంటివి చేయకూడదు. మరీ నొప్పి ఎక్కువగా ఉంటె వైద్యులను సంప్రదించి టాబ్లెట్ వేసుకోవచ్చు.

వాక్సిన్ తీసుకున్న తరువాత కొంత మందికి టెస్ట్ చేయిస్తే పాజిటివ్ గా వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఇది పూర్తిగా అవాస్తవం. వాక్సిన్ తీసుకోవడం వల్ల పాజిటివ్ రాదు. వాక్సిన్ తీసుకున్న తరువాత కూడా కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందే. వాక్సిన్ తీసుకున్నాం కదా మాకు కరోనా రాదనే అలసత్వం వద్దు. వాక్సిన్ కు ముందు కానీ, తీసుకున్న తర్వాత గాని మీకు టెస్టుల్లో పాజిటివ్ వస్తే కరోనా సోకినట్టుగానే భావించి ఐసోలేషన్ ఉండాలి. కరోనా చికిత్స తీసుకోవాలి. టీకా వల్ల పాజిటివ్ వచ్చిందని భావించి అజాగ్రత్తగా ఉంటె ఇతరులకు వైరస్ ను వ్యాప్తి చేసినవారు అవుతారు.

కరోనా వచ్చిన వారు వాక్సిన్ ఎపుడు తీసుకోవాలి? అసలు వాక్సిన్ తీసుకోవాలా వద్దా? అనే ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి. ఇదివరకే కరోనా వచ్చిన వారికి యాంటీ బాడీలు ఉంటాయి. అయితే వాటి వల్ల కొంత కాలం రక్షణ ఉన్నా.. వాక్సిన్ తీసుకోవడమే సురక్షితం. కరోనా నుంచి కోలుకున్న వారు నెల నుంచి రెండు నెలల వ్యవధిలో టీకా తీసుకోవచ్చు.

Related News