logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

జొన్నరొట్టెలు రోజూ తినాలా? ప్రయోజనాలు ఏమిటి? షుగర్ కంట్రోల్ అవుతుందా?

గతంలో మధుమేహం, బీపీ, అధికబరువున్న వారే జొన్న రొట్టెలను ఎక్కువగా తినేవారు. కానీ ఇపుడు కరోనా పుణ్యమా అని రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే తప్ప బతికి బట్టగట్టలేం. దీంతో ఇప్పుడు నగరంలో జొన్న రొట్టెలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. రోడ్లపై ఎక్కడ చూసినా వీటిని అప్పటికప్పుడు చేసి అమ్ముతున్నారు. వీటిని కొనేందుకు జనం బారులు తీరి కనిపిస్తున్నారు. స్టార్ హోటల్స్ మెనులో కూడా ఇప్పుడు జొన్నరొట్టె చేరిపోయింది.

జొన్నరొట్టెలు బలవర్దక ఆహారమన్న విషయం తెలిసిందే. అయితే వీటిని ప్రతి రోజు తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం.. జొన్నలు నెమ్మదిగా జీర్ణమవుతాయి. అందువల్ల రక్తంలో చక్కర కలిసే ప్రక్రియ నెమ్మదిస్తుంది. అందుకే షుగర్ పేషంట్లకు జొన్నలతో చేసిన పదార్థాలను సూచిస్తారు. బరువు తగ్గాలనుకునే వారికీ కూడా ఇవి మంచి ఆప్షన్. మన శరీరానికి కావలసిన ప్రోటీన్ ను ఇవ్వడమే కాకుండా సెల్ గ్రోత్ ను పెంచుతుంది.

ఇందులో ఉండే పోషకాలు ఫ్రీ ర్యాడికల్స్ తో పోరాడటంలో సహాయపడతాయి. అందువల్ల క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. వయసు మీద పడుతున్నప్పుడు సహజంగానే నీరసం ఆవహిస్తుంది. వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. కానీ జొన్న రొట్టెలను రోజు తినేవారిలో ఈ సమస్యలు కనిపించవు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలనుకునే వారికి జొన్న రొట్టెలు అత్యుత్తమమైన మార్గం. ఇందులో ఉండే మెగ్నీషియం, కాపర్, కాల్షియం ఎముకలకు శక్తినిచ్చి బలంగా మారుస్తాయి.

రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారు క్రమం తప్పకుండా జొన్నరొట్టెలు తీసుకోవాలి. ఇందులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇక గుండె జబ్బులను నివారించడంలో జొన్నలకు తిరుగులేదు. ఇవి గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా చేసి ఆకస్మికంగా వచ్చే గుండెపోటు ను నివారిస్తాయి.

ఒక రోజులో మన శరీరానికి అవసరమయ్యే ఫైబర్ సగం వీటి ద్వారానే పొందవచ్చు. ఫైబర్ అధికంగా ఉండటం వలన వీటిని తింటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి. తిన్న ఆహార పూర్తిగా జీర్ణమైనప్పుడు పొట్టలో గ్యాస్ చేరడం, బ్లోటింగ్ లాంటి సమస్యలు తలెత్తవు. రోజులో ఒక పూట జొన్న రొట్టెలను తింటే శరీరాన్ని చాలా తేలికగా ఉంచి రోజంతా యాక్టీవ్ గా ఉండేలా చేస్తుంది.

Related News