logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

హలీమ్ తింటే బరువు పెరుగుతారా?

ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం రానే వచ్చింది. ఇప్పుడు ఎక్కడ చూసినా హలీం ఘుమఘుమలు భోజన ప్రియులకు నోరూరిస్తున్నాయి. కుల, మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు హలీం రుచిని ఆస్వాదిస్తుంటారు. రంజాన్ మాసం వచ్చిందంటే చాలు హలీం కోసం హైద్రాబాద్ బిర్యానీని సైతం మనవాళ్ళు పక్కనపెట్టేస్తారు. చుక్క నీరు కూడా తాగకుండా రోజంతా ఉపవాసం ఉండే వారు హలీం తో తమ ఉపవాసాన్ని ముగిస్తారు.

హలీంను ఏడాది పొడుగునా తిన్నా శరీరానికి ఎలాంటి హాని ఉండదని చెప్తారు. ఈ వంటకంలో ఉన్న పోషకాలు తక్షణ శక్తినిస్తాయి. రోజంతా ఉపవాసం ఉండటం వల్ల వచ్చే నీరసాన్ని వెంటనే తగ్గిస్తుంది. ఈ వంటకంలో వాడే పప్పుధాన్యాలు, నెయ్యి, తాజా మాంసం, డ్రై ఫ్రూట్స్ లాంటివి ఎంతో బలవర్దకమైనవి. ఇవి నెల రోజుల పాటు ఉపవాస దీక్ష చేయగలిగేలా శరీరాన్ని సిద్ధం చేస్తుంది. ఎక్కువపోషకాలు ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయదు. రక్తప్రసరనను మెరుగుపరుస్తుంది. సంతానోత్పత్తికి అవసరమైన శక్తిని ఇస్తుంది.

అందుకే ఇఫ్తార్ విందులో ఈ వంటకానికి అంతటి ప్రాధాన్యం ఉంది. హలీంను ఏ విధంగా తీసుకున్నా బరువు పెరగరు. పూర్తి భోజనంలో ఉండే పోషకాలన్నీ ఒక్క హలీంతోనే శరీరానికి అందుతాయి. ఒక వ్యక్తికి అవసరమైన కేలరీలలో 30 శాతం ఇందులో లభిస్తాయి. అయితే తయారీదారులు ఎంచుకునే పదార్థాలపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. హలీంలో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇరానీ హలీమ్, దక్కని హలీం లతో పాటుగా శాకాహార ప్రియుల కోసం వెజిటేరియన్ హలీం, మాంసాహారులు కోసం ఈము హలీమ్, ఫిష్ హలీం లను కూడా ప్రత్యేకంగా తయారుచేస్తున్నారు.

రుచిలో మాత్రం దేని ప్రత్యేకత దానిదే. ఈ వంటకం తయారీ కూడా ఎంతో ప్రత్యేకం. తెల్లవారుజామున 3 గంటల నుంచే దీనిని వండే ప్రక్రియ మొదలవుతుంది. ఇందులో మటన్, గోధుమలు, పప్పు ధాన్యాలు, బాసుమతి బియ్యం, నెయ్యి, అల్లంవెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, డ్రై ఫ్రూప్ట్స్ సమపాళ్లలో కలుపుతారు. మాంసం ముక్కలన్నీ ఉడికి పిండిలా మారేంతవరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇలా దాదాపు 9 గంటల పాటు ఉడికించిన తర్వాత సాయంత్రానికి ఘుమఘుమలాడే హలీం తయారవుతుంది.

 

 

Related News