దేశవ్యాప్తంగా కరోనా తీవ్ర రూపం దాలుస్తుంది. కరోనా తో చికిత్స పొందుతున్న డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ (62) బుధవారం మృతి చెందారు. ప్రస్తుతం చెప్పాక్కం ఎమ్మెల్యేగా ఉన్నఅన్బళగన్ 2001, 2011, 2016లో కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఓ శాసన సభ్యుడు కరోనాతో మరణించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
కాగా నేడు ఆయన పుట్టిన రోజు కావడం అదే రోజు అయన లోకాన్ని విడిచి వెళ్లడంతో అన్బళగన్ అనుచరులు, పార్టీ కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. లాక్ డౌన్ సమయంలో నిత్యం ప్రజలకు నదుబాటులో ఉంటూ నాయిక కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. కాగా ఇటీవల అనారోగ్యం పాలవడంతో ఆసుపత్రిలో చేర్చగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.
అయితే కరోనా కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణాలు వదియారని వైద్యులు తెలిపారు. అన్బళగన్ మృతిపై సీఎం పళని స్వామి, డీఎంకే చీఫ్ స్టాలిన్ సహా పలువురు విచారం వ్యక్తం చేశారు. దిష్ట్రుబ్యూటర్, ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించిన అన్బళగన్ తమిళంలో జయం రవితో అది భగవాన్ అనే సినిమాను నిర్మించారు.