logo

  BREAKING NEWS

ఆ రోజు రాత్రి 9 గంట‌ల‌కు పాక్ ప‌ని ఖ‌త‌మ‌య్యేదా ?  |   కంటిచూపు త‌గ్గుతోందా ? ఈ చిన్న చిట్కాలు పాటించండి  |   గూగుల్ విజిటింగ్ కార్డు ఇస్తోంది.. మీకు కావాలా ?  |   బీజేపీలోకి రేవంత్ రెడ్డి.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు  |   మళ్లీ పాత పార్టీలోకే విజ‌య‌శాంతి  |   మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఈసారి అంద‌రి అభిమాన సింగ‌ర్‌  |   క‌రోనా సెకండ్ వేవ్ అంటే ఏంటి ? మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడు మొద‌ల‌వుతుంది ?  |   మీ ఫోన్‌లో ఈ 21 యాప్‌లు ఉన్నాయా ? ‌వెంట‌నే డిలీట్ చేసేయండి !  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు ?  |   క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త విధానం.. ఇక క‌రోనా టెస్టులు సులువు, చౌక‌  |  

బైక్ కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్.. రూ. 15 వేల తగ్గింపు!

బైక్ కొనాలనుకునే వారికి హీరో కంపెనీ శుభవార్త వినిపించింది. లాక్ డౌన్ కాలంలో కస్టమర్లు లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్న వాహన తయారీదారు సంస్థలు ఇప్పుడు సేల్స్ ను పెంచుకునే పనిలో పడ్డాయి. వరుస ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా ప్రముఖ వాహన తయారీదారు సంస్థ హీరో కూడా కస్టమర్లకు శుభవార్త వినిపించింది.

హీరో మోటోకార్ప్ బైక్ లు, కూటర్లు కొనేవారికి భారీ తాగింపు ప్రకటించింది. బైక్ పై రూ. 10 వేలు, స్కూటర్ పై రూ. 15 వేల తగ్గింపు ప్రకటించింది. అయితే కొన్ని షరతులను కూడా విధించింది. ఈ అఫర్ కేవలం బిఎస్4 వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. అయితే ఈ వాహనాలకు కస్టమర్లు ఆన్ లైన్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవలసి ఉంటుంది.

ఏప్రిల్ 1వ తేదీ నుంచి కేవలం బిఎస్ 6 వాహనాలను మాత్రమే విక్రయించాలని కేంద్రం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే అదే సమయంలో లాక్ డౌన్ విధించడంతో బీఎస్ 4 వాహనాలు అలాగే మిగిలిపోయాయి. తాజాగా ఈ వాహనాలను 10 రోజుల వ్యవధిలో విక్రయించుకునే సౌలభ్యం కంపెనీలకు కల్పించింది. దీంతో ఈ వాహనాలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది హీరో కంపెనీ. తక్కువ ధరకే వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

Related News