logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

‘ఇండస్ట్రీని నడిపేది వారు కాదు’.. బాలయ్య- చిరు వ్యవహారంపై దర్శకుడి కామెంట్

టాలీవుడ్ లో ఎవరేమనుకున్నా కుండ బద్దలు కొట్టినట్టుగా తన అభిప్రాయం చెప్పే దర్శకులలో తేజ ఒకరు. ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో వేడి పుట్టిస్తున్న వ్యవహారం పై తేజ తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణలో లాక్ డౌన్ సడలించడంతో సినిమా షూటింగ్ లు కూడా ప్రారంభించనున్నారు. ఈ విషయంపై సినీ పెద్దలంతా కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో చిరు ఇంట్లో మీటింగ్ ఏర్పాటు చేసారు.

ఆ సమావేశానికి బాలయ్య బాబును ఆహ్వానించకపోవడంపై పెద్ద దుమారమే రేగింది. బాలయ్య చేసిన వ్యాఖ్యలకు మెగా బ్రథర్ నాగ బాబు స్పందించడంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదమైంది. దీంతో టాలీవుడ్ పెద్దలు కలుగ జేసుకుని సముదాయించినా ఇప్పట్లో ఈ వ్యవహారం సద్దుమణిగేలా లేదు. తాజాగా దర్శకుడు తేజ ఈ విషయం పై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నేను సక్సెస్ ఫుల్ దర్శకుడిని కాదు కాబట్టి నన్ను పిలవలేదు.

వ్యక్తిగతమైన సమావేశాలకు ఎవ్వరిని పిలవాల్సిన పనిలేదని కానీ ఇక్కడ జరిగింది సినీ పరిశ్రమకు సంబందించిన చర్చ కాబట్టి బాలయ్యనే కాదు ఇతర పెద్దలను కూడా సంప్రదించాల్సిన అవసరం ఉందన్నారు. టాప్ దర్శకులు వస్తుంటారు పోతుంటారు. కానీ పరిశ్రమ ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎవరికీ వారు తామే ఇండస్ట్రీని నడిపిస్తున్నామనుకోవడం అవివేకం అన్నారు. మరి తేజ చేసిన కామెంట్లతో ఈ వ్యవహారం ఎక్కడివరకు వెళుతుందో చూడాలి మరి.

Related News