logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

ఆ హీరోయిన్ కోసం బన్నీ పట్టుబట్టాడు… కానీ రశ్మికను తీసుకున్నాం: సుకుమార్

అల్లు అర్జున – సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’. ఈ సినిమాతో రష్మిక మందన్నా తొలిసారిగా బన్నీతో జోడీ కడుతుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు సుకుమార్ తాజాగా తన స్నేహితుడు హరిప్రసాద్ జక్కా నిర్మించిన ‘ప్లే బ్యాక్’ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా ఈ సినిమాలో నటించిన తెలుగమ్మాయి, ‘మల్లేశం’ ఫేమ్ అనన్యను ప్రత్యేకంగా అభినందించారు. ఆమె నటన చాలా సహజంగా ఉందంటూ కితాబిచ్చాడు. తన సినిమాల్లో కూడా తెలుగు నటీనటులను తీసుకోవడానికే తాను ఇష్టపడతానన్నారు. తన ‘రంగస్థలం’ సినిమాలో ప్రకాష్ రాజ్, సమంత తప్ప మిగిలిన ఆర్టిస్టులందరూ తెలుగు వారేనన్నారు. అయితే పుష్ప సినిమాకోసం కూడా మొదట ఒక తెలుగు హీరోయిన్ కోసం వెతికారట.

అందుకు కారణం బన్నీనే అన్నారు. తన సినిమాలో ఈసారి ఒకతెలుగు హీరోయిన్ కు అవకాశం ఇవ్వాలని బన్నీ పట్టుబట్టాడు. అయితే బన్నీ లాంటి ఒక స్టార్ హీరో ఇలా అడగటం చిన్న విషయం కాదు. కానీ కొన్ని కారణాల వల్ల అలా జరగలేదు. చివరకు తెలుగు బాగా వచ్చిన రష్మిక మందన్నాను తీసుకోవాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. తన నెక్స్ట్ సినిమాలో మాత్రం అచ్చతెలుగు అమ్మాయినే హీరోయిన్ గా తీసుకుంటామని సుకుమార్ హామీ ఇచ్చాడు.

Related News