logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

దర్శకుడు శంకర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్!

దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ‘రోబో’ సినిమాపై వివాదం ఇప్పట్లో ముగిసేట్లు లేదు. ఈ సినిమా దర్శకుడు శంకర్ పై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఎగ్మోర్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్ ఈ వారెంట్ ను జారీ చేసింది. తమిళంలో ‘ఏంథిరన్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషల్లోకి డబ్ అయ్యింది.

అయితే శంకర్ తన సినిమా కథను కాపీ కొట్టాడంటూ ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు. తాను రాసిన ‘జిగుబా’ అనే కథను కాపీ చేసి ఏంథిరన్ గా తెరకెక్కించాడని ఆరూర్ తమిళ నాడన్ అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం ఫిర్యాదు చేసాడు. అయితే ఈ కేసులో సంవత్సరాలు గడిచిపోతున్నా ఈ కేసులో శంకర్ కోర్టుకు హాజరు కాకపోవడంతో తాజాగా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడు శంకర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది.

Related News