logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

మరోసారి రచ్చకెక్కిన దాసరి కుమారులు.. పోలీసులకు ఫిర్యాదు!

సినీ దర్శకుడు, దివంగత దాసరి నారాయణరావు కుటుంబంలో మరోసారి కలహాలు భగ్గుమన్నాయి. దాసరి ఇద్దరు కుమారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీసు స్టేషన్ కు వెళ్లారు. ఆస్థి తగాదాలే ఇందుకు కారణమని తెలుస్తుంది. కాగా దాసరి పెద్ద కుమారుడు ప్రభు సోదరుడు అరుణ్ పై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. అన్ననని కూడా చూడకుండా తనపై అరుణ్ దాడి చేసాడని, తన భార్యని, తన కుటుంబాన్ని దుర్భాషలాడాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రభు మాట్లాడుతూ.. తన తండ్రి దాసరి రాసిన వీలునామా ప్రకారమే తాను ఈ ఇంట్లో ఉంటున్నానని తెలిపారు. దాసరి తన మనుమరాలు పేరుపై ఈ ఇంటిని రాసారన్నారు. కాగా ఈ వివాదంపై ఈ నెల 24 న అరుణ్ అర్థరాత్రి తాగి తన ఇంటి గోడ దూకి అక్రమంగా ఇంట్లోకి చొరబడ్డాడని తెలిపారు. తనను కొట్టాడని ఆరోపించారు. భార్య, అత్తామామలను కూడా దుర్భాషలాడాడని అన్నారు. అయితే ఈ వివాదంపై సినీ పెద్దలు మోహన్ బాబు, సి కళ్యాణ్, మురళి మోహన్ జోక్యం చేసుకుని తనకు అండగా నిలవాలన్నారు. సినీ ప్రముఖులంతా కలిసి తనను ఒంటరి వాడిని చేసారని ఆవేదన వ్యక్తం చేసారు.

Related News