logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ ప్రొడ్యూసర్ సతీమణి..!

టాలీవుడ్ టాప్ నిర్మాతల్లో ఒకడైన దిల్ రాజు ఇటీవల రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయన మొదటి భార్య అనిత అనారోగ్యంతో కాలం చేయడంతో ఆయన కూతురు కోరిక మేరకు తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఇప్పుడు దిల్ రాజు సతీమణి తేజస్విని కి సంబందించిన మరో వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. తేజస్విని త్వరలోనే సినిమాల్లోకి రానున్నారు. ప్రస్తుతం కరోనా కాలంలో సినిమా థియేటర్లు తెరిచినా ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఓటిటి కి మంచి డిమాండ్ ఏర్పడింది.

అందుకు తగ్గట్టుగానే దర్శక నిర్మాతలు కథలు సిద్ధం చేసుకుంటున్నారు. కొంత కాలంగా కథలో వేటలో ఉన్న దిల్ రాజుకు ఆయన సతీమణి ఒక మంచి కథను తయారు చేసి గిఫ్ట్ గా ఇచ్చారట. ఆమె కథకు ఫిదా అయినా దిల్ రాజు ఈ కథను మరింత మెరుగులు దిద్దెందుకు ఒక రచనా బృందాన్ని కూడా ఏర్పటు చేసాడని సమాచారం.

ఈ కథ కనుక కార్యరూపం దాలిస్తే రమా రాజమౌళి బాటలో తేజస్విని కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. దిల్ రాజు ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్- 3 సినిమాను తెరకెక్కించే ప్రయత్నం లో ఉన్నారు.

Related News