logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

ఫాన్స్ కు షాక్: ఆ సినిమాలో అల్లు అర్జున్ లేడు.. లాజిక్ తో కొట్టిన దిల్ రాజు

దిల్ రాజు నిర్మాణంలో అల్లు అర్జున్ ‘ఐకాన్’ సినిమా ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ రాసుకున్న కథ బన్నీకి చెప్పడం.. ఈ సినిమాకు బన్నీ ఒకే చెప్పడం అన్నీ చెకచెకా జరిగిపోయాయి. అయితే మధ్యలో త్రివిక్రమ్ ఎంట్రీ ఇవ్వడంతో ఐకాన్ సినిమాకు బ్రేకులు పడ్డాయి. ‘అల వైకుంఠపురం’ సినిమాను ముందగా పూర్తి చేయాలని భావించిన బన్నీ ఐకాన్ సినిమాను హోల్డ్ లో పెట్టాడు. అయితే తాజాగా వకీల్ సాబ్ ను సూపర్ డూపర్ హిట్ చేసిన వేణు శ్రీరామ్ నెక్స్ట్ సినిమా ఇదే వుండబోతుందనే చర్చ జరిగింది.

దీనిపై నిర్మాత దిల్ రాజు కూడా క్లారిటీ ఇచ్చాడు. మా నిర్మాణంలో రాబోయే నెక్స్ట్ సినిమా ఐకాన్. ఈ సినిమా కథ విన్నప్పటి నుంచి దానితోనే ట్రావెల్ చేసాము. నా మనసుకు చాలా నచ్చిన సినిమా ఇది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తాం అని చెప్పాడు. అయితే ఇక్కడే బన్నీ ఫాన్స్ పప్పులో కాలేశారు. దిల్ రాజు తమ నెక్స్ట్ సినిమా ఐకాన్ అని ప్రకటించాడు గాని అందులో అల్లు అర్జున్ హీరో అని ఎక్కడా చెప్పలేదు. ఈ సినిమా నుంచి బన్నీ ఇదివరకే తప్పుకున్నాడట.

అప్పుడున్న పరిస్థితుల్లో వేణు చెప్పిన కథ నచ్చి సినిమా ఒకే చేసాడట. కానీ ‘అల వైకుంఠపురం’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తో బన్నీ రేంజ్ మారిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐకాన్ చేయడం సరికాదని భావిస్తున్నాడట. అయితే ఈ సినిమా కథలో కొన్ని మార్పులు సూచించడంతో దానికి దర్శక నిర్మాతలు ఒప్పుకోలేదని అందుకే సింపుల్ గా ఐకాన్ సినిమా నుంచి బన్నీ సైడ్ అయిపోయాడనే టాక్ కూడా ఉంది.

ఇక రెమ్యునరేషన్ విషయంలో కూడా బన్నీని నిర్మాత శాటిస్ ఫై చేయలేకపోయాడనే రూమర్ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఐకాన్ సినిమా స్టోరీని మరో హీరోకి చెప్పి ఒకే చేయించే ప్రయత్నాల్లో ఉన్నాడట దర్శకుడు వేణు శ్రీరామ్. ఇక దిల్ రాజు ఐకాన్ సినిమాను ప్రకటించడంతో భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న అభిమానులు ఈ సినిమాలో అల్లు అర్జున్ లేడని తెలిసి డీలా పడిపోయారు. ఏది ఏమైనా దిల్ రాజు లాజిక్ తో కొట్టాడని అంతా అనుకుంటున్నారు. ఇక పుష్ప సినిమా టీజర్లో స్టైలిష్ స్టార్ కు బదులుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని వేయడం పట్ల దిల్ రాజు స్పందిస్తూ .. అది వారు పెట్టుకున్నారేమో నాకు తెలియదని సమాధానం ఇచ్చాడు.

Related News