logo

  BREAKING NEWS

‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |   ‘గుంటూరు’కు చెందిన కోహినూర్ వజ్రం బ్రిటన్ చేతికి ఎలా వెళ్ళింది?  |   బ్రేకింగ్: పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. జ‌గ‌న్‌కు భారీ షాక్‌  |   వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |  

ఓటరు గుర్తింపు కార్డులపై భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం!

భారత ఎన్నికల సంఘం ఓటరు గుర్తింపు కార్డులపై కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా జమిలి ఎన్నికలపై చర్చ సాగుతుంది. ఇదే సమయంలో ఆన్ లైన్ పోలింగ్ ను కోరుకునే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డు తరహాలో ఓటరు గుర్తింపు కార్డులను కూడా డిజిటలైజ్ చేసే విధంగా ఎన్నికల సంఘం అడుగులు వేస్తునట్టుగా తెలుస్తుంది.

ప్రసుతం ఆధార్ కార్డులను ఇంటర్ నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకుంటున్నట్టుగానే ఓటరు గుర్తింపు కార్డులను కూడా భవిష్యత్తులో ఇంటర్ నెట్ సహాయంతో పొందవచ్చు. ఇప్పటీకే ఇందుకు సంబందించిన ప్రణాలికలు భారత న్నికల సంఘం చేస్తుందని అయితే కొన్ని కీలక వర్గాలతో చర్చలు జరిపిన అనంతరం ఈ అంశంపై తుది నిర్ణయం వెలువడుతుందని ఎన్నికల సంఘం పేర్కొంటుంది.

మూడేళ్లుగా కొత్తగా ఓటు నమోదు చేసుకుంటున్న వారికి మాత్రమే ఆధునిక టెక్నాలజీ సహాయంతో డిజిటల్ కార్డులను ఈసీ జారీ చేస్తుంది. ఐతే పాత ఐడీ కార్డులు అన్నిటినీ డిజిటలైజేషన్ చేసే దిశగా మాత్రం ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. త్వరలో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 2021 వరకు ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

దీని ప్రకారం కొత్తగా ఓటరు ఐడీ కోసం నమోదు చేసుకునే వారు తమ ఫోన్ నంబరును ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఓటరు ఐడీ ఫోన్ నంబరుతో లింక్ చేయబడుతుంది. ఈ విధంగా ఇంటర్ నెట్ ద్వారా ఓటరు ఐడీ కార్డును పొందవచ్చు. ఆ డిజిటల్ వెర్షన్ ను ఉపయోగించి ఓటు వేయచ్చు. అదే ఇంతకు ముందే ఓటరు కార్డును కలిగి ఉన్నవారు కొన్ని ఫార్మాలిటీస్ ను పూర్తి చేసి ఆన్ లైన్ ద్వారా ఓటరు కార్డు పొందవచ్చు.

కొత్త విధానం ద్వారా విదేశాల్లో ఉండే భారతీయులు కూడా సులభంగా ఓటరు కార్డును పొందవచ్చు. ఒక వేళ ఓటరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చిరునామా మార్చుకుంటే కొత్త పత్రాలను సమర్పించి అప్ డేట్ చేసుకోవచ్చు. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఎలెక్షన్ కమిషన్ ఈ డిజిటలైజేషన్ సంస్కరణ చేపడుతుండటం విశేషం.

1993 సంవత్సరంలో టీఎన్ శేషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఉన్న సమయంలో ఓటరు గుర్తింపు కార్డులో మొదటి సారిగా వ్యక్తుల ఫోటోలను ముద్రించడం జరిగింది. ఇన్నేళ్ల తర్వాత మరోసారి ఈసీ కొత్త విధానాన్ని అమలు చేయనుంది.

 

 

 

Related News