logo

  BREAKING NEWS

ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |   ప్రధాని మోదీ వేయించుకున్న వాక్సిన్ ఏదో తెలుసా?  |   శ‌భాష్‌ జ‌గ‌న్‌.. ఈ ఒక్క నిర్ణ‌యంతో మ‌రో మెట్టు ఎక్కేశావు  |   పెట్రోల్ పంపులో మ‌న‌కు ఇవ‌న్నీ ఉచితంగా ఇవ్వాల్సిందే  |   శుభ‌వార్త‌.. త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. 26-02-2021 బంగారం ధ‌ర‌లు  |   నితిన్ ‘చెక్’ మూవీ రివ్యూ.. సినిమా హిట్టా ఫట్టా?  |   బ్రేకింగ్: ఘట్కేసర్ కిడ్నాప్ డ్రామా కేసులో యువతి ఆత్మహత్య!  |   కుప్పంలో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ.. షాకివ్వనున్న కీలక నేతలు!  |  

బిట్ కాయిన్ల దెబ్బకు భారత్ కీలక నిర్ణయం..!

కరోనా కారణంగా ఇప్పటివరకు పెట్టుబడులకు సేఫ్ అనుకున్న బంగారం, షేర్ మార్కెట్లు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. దీంతో దేశంలో వర్చువల్ కరెన్సీలు, డిజిటల్ కరెన్సీలు, క్రిప్టోకరెన్సీలకు ఇటీవల భారీగా ఆదరణ పెరిగిపోతుంది. వీటినే డిజిటల్ కరెన్సీ అంటారు. బిట్ కాయిన్ల వంటి క్రిప్టో కరెన్సీ పై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మాస్క్ తాను బిట్ కాయిన్ల రూపంలో కూడా చెల్లింపులు స్వీకరిస్తానని ప్రకటించడంతో వీటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. బంగారం, బ్యాంకులలో ఇన్వెస్ట్ చేయడం కన్నా ఎంతిరియం, బిట్ కాయిన్ వంటి వాటిపై పెట్టుబడులు పెట్టడం సురక్షితమని భావిస్తున్నారు. ఈ క్రిప్టోలరెన్సీల దెబ్బకు చాలా దేశాలు సొంత డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టాలని భావిస్తున్నాయి. ఆ జాబితాలో భారత్ కూడా చేరనుంది. అసలు ఈ డిజిటల్ కరెన్సీ అంటే ఏమిటో తెలుసుకుందాం..

డిజిటల్ కరెన్సీ అంటే..?
మనం పైన చెప్పుకున్న క్రిప్టోకరెన్సీలన్నీ డిజిటల్ కరెన్సీలే. అయితే క్రెడిట్, డెబిట్ కార్డులు, యుపిఐ పేమెంట్లు, క్యూర్ కోడ్ ల ద్వారా చేసే చెల్లింపులు ఇవేవీ డిజిటల్ కరెన్సీ కిందకు రావు. ఇవన్నీ బ్యాంకుల ద్వారా చేసే లావాదేవీలు. బ్యాంకులపై ఇవి ఆధారపడవు. డిమాండ్ సరఫరాల ఆధారంగా వీటి విలువ మారుతుంటుంది. ఇది ఏ దేశానికి చెందినది కాదు. ఏ నియంత్రణ సంస్థ పరిధిలోకి రాదు. ఇక మనదేశం విషయానికి వస్తే మనదేశంలో ఇది చట్టబద్ధం కాదు. ఆర్బీఐ పరిధిలో పనిచేసే ఏ సంస్థ కూడా వీటితో లావాదేవీలు నిర్వహించదు. మనదేశంలో క్రిప్టో కరెన్సీ లీగల్ కాకపోయినప్పటికీ వీటిని ట్రేడ్ చేయటం మాత్రం లీగల్. మన దేశంలో ఇప్పటివరకు 50 నుంచి 60 లక్షల మంది ఈ బిట్ కాయిన్లను వినియోగిస్తున్నారు. దీని ధర ప్రపంచవ్యాప్తంగా ఒకే రకంగా ఉంటుంది. వీటి విలువలో హెచ్చుతగ్గులు కూడా చాలా వేగంగా మారిపోతుంటాయి.

బిట్ కాయిన్ల లాంటి ప్రైవేటు క్రిప్టో కరెన్సీల వల్ల ఎలాంటి భద్రతా ఉండదు. నిజానికి వీటి వల్ల అనేక అక్రమాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. ఒక వేళ ఈ కంపెనీలు ఎత్తేస్తే నష్టపరిహారం కూడా లభించదు. దీనిని బ్లాక్ చైన్ గా చెప్తారు. ఉగ్రవాదులకు నిధులను అందించడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు. అందువల్ల వీటి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ఆయా దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం కూడా ఇటువంటిదే.

కరెన్సీ, డాలర్ల వంటి వాటికి ప్రభుత్వాలు, బ్యాంకుల నియంత్రణలో ఉండి అవి పూచీకత్తుగా ఉంటాయి. కానీ ఈ కాయిన్లను కొనుగోలు చేసి నష్టపోతే ప్రభుత్వం దానికి బాధ్యత వహించదు. ఇప్పుడు ఒక్కో బిట్ కాయిన్ ధర రూ. 70 లక్షలకు పైమాటే. ఇలాంటి ప్రైవేటు క్రిప్టోకరెన్సీ వ్యాప్తి పెరుగుతున్నా ప్రభుత్వ నియంత్రణ సంస్థలు పట్టించుకోటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. 2018 లో ఆర్బీఐ క్రిప్టో కరెన్సీని నిషేధించింది. అయితే వీటిని నిషేధించే అధికారం ఆర్బీఐకి లేకపోవడంతో సుప్రీం ఈ లావాదేవీలకు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. త్వరలోనే భారత్ లో అధికారిక డిజిటల్ కరెన్సీపై ప్రకటన ఉంటుందని వెల్లడించింది.

దేశంలో బిట్ కాయిన్ల వంటి ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలకు చోటు ఇవ్వబోమని ఆర్బీఐ స్పష్టం చేసింది. అందులో భాగంగా వీటి నిషేధానికి సంబంధించి ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో సంకేతాలని ఇచ్చింది. త్వరలోనే ప్రైవేటు క్రిప్టోకరెన్సీలపై నిషేధం విధించి వాటి స్థానంలో రిజర్వు బ్యాంకు చేతుల మీదుగా అధికారిక డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టనుంది. ఆర్బీఐ ఆధారంగా డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వస్తే వీటి ద్వారా అనేక సౌకర్యాలు పొందొచ్చు.

 

Related News