logo

  BREAKING NEWS

బ్రేకింగ్: ఎన్నికలపై సుప్రీం తీర్పు: నిమ్మగడ్డ సంచలన నిర్ణయం!  |   బిగ్ బ్రేకింగ్: ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కీలక తీర్పు!  |   సిక్కిం సరిహద్దుల్లో చైనా దుస్సాహసం.. బుద్ధి చెప్పిన సైనికులు  |   చింత‌గింజ‌ల‌తో మోకాళ్ల నొప్పుల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం‌  |   పాత రూ. 100, రూ.10, రూ.5 కరెన్సీ నోట్లు ఇకపై చెల్లవా.. నిజమెంత?  |   మాజీ మంత్రి జానారెడ్డికి ఊహించని షాక్.. బీజేపీ ప్లాన్ లో భాగమేనా?  |   వీడని ఉత్కంఠ.. పంచాయతీ ఎన్నికలపై మరో ట్విస్ట్..!  |   బ్రేకింగ్: వికటించిన కరోనా టీకా.. ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్!  |   నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల కౌంటర్: వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!  |   అమెరికా అధ్యక్షుడి ప్రసంగాల వెనుక మన తెలుగోడి ప్రతిభ  |  

నెల రోజుల్లో 20 కిలోలు త‌గ్గే అద్భుత‌మైన డైట్ షీట్

అధిక బ‌రువు ఈ రోజుల్లో వంద‌లో కనీసం 70 మందిని వేధిస్తున్న స‌మ‌స్య‌. అనేక వ్యాధుల‌కు ప్ర‌ధాన కార‌ణం కూడా అధిక బ‌రువే. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే అధికంగా బ‌రువు పెర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. అధిక బ‌రువు ఉండాల‌ని ఎవ‌రూ కోరుకోరు. అంద‌రూ ఫిట్‌గానే ఉండాల‌నుకుంటున్నారు. కానీ ఉండ‌లేరు. బ‌రువు పెరుగుతున్న‌ప్పుడు ప‌ట్టించుకోకుండా, అధికంగా బ‌రువు పెరిగాక త‌గ్గించుకోవ‌డానికి తెగ క‌ష్ట‌ప‌డుతుంటారు.

జిమ్‌కు వెళ్ల‌డం, ఉద‌యాన్ని వాకింగ్‌, జాగింగ్ వంటివి చేస్తుంటారు. బ‌రువు త‌గ్గ‌డానికి ఇవి బాగానే ఉప‌యోగ‌ప‌డ‌తాయి. కానీ, మ‌న ఆహార‌పు అల‌వాట్లు మార్చుకోకుండా జిమ్ చేసినా, వాకింగ్ చేసినా బ‌రువు త‌గ్గ‌రు. బ‌రువు త‌గ్గ‌డానికి ప్ర‌కృతి వైద్యులు మంచి డైట్ చెబుతున్నారు. వీరు చెప్పే ఆరోగ్య‌క‌రమైన డైట్‌తో బ‌రువు సుల‌భంగా, ఆరోగ్య‌క‌ర ప‌ద్ధ‌తిలో త‌గ్గ‌వ‌చ్చు.

బ‌రువు త‌గ్గాల‌ని అనుకునే వారు ఉద‌యాన్నే ఒక గ్లాసు గోరు వెచ్చ‌టి నీటిలో తేనె, నిమ్మ‌ర‌సం వేసుకొని తాగాలి. అక్క‌డి నుంచి మ‌నం తినే ఆహారంపై జాగ్ర‌త్త‌లు వ‌హించాలి. ఉద‌యం టిఫిన్‌గా నూనెలో వేయించిన పూరీలు, వ‌డ‌లు వంటివి తిన‌కూడ‌దు. తక్కువ నూనెతో చేసే ఇడ్లీ, దోశ తినాలి. వీటి కంటే కూడా మొల‌కెత్తిన విత్త‌నాలు తిన‌డం మ‌రీ మంచిది. ఇవి తింటే శ‌రీరానికి మంచి పోష‌కాలు అందుతాయి. పెస‌ర్లు, బొబ్బ‌ర్లు, శెన‌గ‌లు మొల‌కెత్తినవి ఉద‌యం టిఫిన్‌గా చేస్తే బ‌రువు త‌గ్గుతారు.

మ‌ధ్యాహ్నం కొంచెం అన్నం తిన‌వ‌చ్చు. కానీ, ఫ్రై కూర‌లు అస్స‌లు తిన‌వ‌ద్దు. కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు తినాలి. అన్నం ఎంత తింటే కూర కూడా స‌మానంగా తినాలి. కాక‌పోతే కూర‌లో మ‌సాలాలు, నూనె, ఉప్పు, కారం త‌క్కువ‌గా వేసుకోవాలి. అన్నం బ‌దులు రొట్టె తింటే ఇంకా మంచిది. బ‌రువు తగ్గాల‌ని అనుకునే వారు రాత్రి పూట అన్నం తిన‌డం త‌ప్ప‌నిస‌రిగా మానేయాలి.

అన్నం బ‌దులు క‌డుపు నిండా పండ్లు తిన‌డం అల‌వాటు చేసుకుంటే బ‌రువు త‌గ్గ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బాగా రాత్రి ప‌డ్డా క‌డుపు నిండా తిని వెంట‌నే ప‌డుకుంటే బరువు పెరుగుతారు. మీకు అవ‌కాశం ఉన్నంత‌లో ఎంత త్వ‌ర‌గా రాత్రి భోజ‌నం పూర్తి చేస్తే అంత మంచిది. రాత్రి భోజ‌నంగా పండ్లు తిన‌లేని వారు రొట్టె తింటే స‌రిపోతుంది.

అధిక బ‌రువు త‌గ్గించుకోవాల‌ని అనుకునే వారు మంచినీళ్లు ఎక్కువ‌గా తాగాలి. ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర నుంచి గంట‌కో గ్లాసు నీళ్లు తాగ‌డం అల‌వాటు చేసుకోవాలి. టీ, కాఫీలు పూర్తిగా మానేయాలి. ఉద‌యం కూర‌గాయ‌ల‌తో చేసిన జ్యూస్‌, సాయంత్రం ఫ్రూట్ జ్యూస్ తాగ‌డం కూడా బ‌రువు త‌గ్గ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ ఆహార‌పు అల‌వాట్లు పాటిస్తూనే మీరు చేసే ఎక్స‌ర్‌సైజ్‌లు, యోగాస‌నాలు చేసుకుంటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.

Related News