అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా(60) మరణం ఆయన అభిమానులను షాక్ కు గురిచేసింది. గుండెపోటు కారణంగా మారడోనా మృతి చెందినట్టుగా అధికారులు వెల్లడించారు. కాగా ఆయన మరణంపై ఇప్పుడు కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. మారడోనాది సహజ మరణం కాదని అతని మృతికి వైద్యుడు లియోపోల్డో ల్యూక్ కారణమంటున్నారు.
ల్యూక్ మారడోనాకు అందించాల్సిన చికిత్స విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి అతని మృతికి కారణమయ్యాడంటూ మారడోనా కుమార్తెలు దల్మా, గియానినా, జనా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ తర్వాత ఆయన గుండె పనితీరుకు తగ్గట్టుగా ల్యూక్ వైద్యం అందించలేదాని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల స్వల్ఫ అస్వస్థతకు గురైనా డిగో మారడోనా లా ప్లాటాలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం మెుదడులో రక్త కట్టినట్లు గుర్తించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. శస్త్ర చికిత్స చేసిన వైద్యులు ఆ క్లాట్‌ను తొలిగించారు. 60 ఏళ్ల మరడోనా పలు సమస్యలతో బాధనడుతున్నారు.
ఇప్పటికే రెండు సార్లు గుండెపోటు రాగా.. గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. అలాగే హెపటైటిస్ బారిన కూడా పడ్డారు. కాగా సర్జరీ అనంతరం మారడోనాకు మరోసారి గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో అంబులెన్స్ కు ఫోన్ చేయగా గంటన్నర తర్వాత వచ్చిందని అందుకు గల కారణాలు తెలియజేయాలని మారడోనా లాయర్ డిమాండ్ చేసారు.