logo

  BREAKING NEWS

మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |   ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నోటిఫికేషన్ రద్దు!  |   బ్రేకింగ్: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!  |   మున్సిప‌ల్ ఎన్నిక‌లపై సీక్రెట్ స‌ర్వే.. రిజ‌ల్ట్ చూసి షాకైన జ‌గ‌న్‌  |   బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూస్.. పెరిగిన బంగారం ధ‌ర‌లు  |   బ్రేకింగ్: నిమ్మగడ్డ వివాదాస్పద నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు.. భారీ ఎదురుదెబ్బ!  |   ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |  

ఎర్రకోట అల్లర్లు: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ లోని ఎర్ర కోట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే శాంతియుతంగా నిరసనలు చేస్తామని చెప్పిన రైతులు ఆ తర్వాత విధ్వంసకర పరిస్థితులు సృష్టించడం, ఎర్రకోటలోకి చొచ్చుకుని వెళ్లి అక్కడున్న భద్రతా సిబ్బందిపై దాడులు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది

ఈ ఘటనపై రైతు సంఘాలు స్పందిస్తూ.. హింసాత్మక వాతావరం సృష్టించడం తమ లక్ష్యం కాదని అన్నారు. తమ ఉద్యమంలో కొన్ని అసాంఘిక శక్తులు చొరబడ్డాయని వారే తమ రూట్ మ్యాప్ ను మార్చి ఎర్రకోటవైపు రైతులను ఉసిగొల్పినట్టుగా చెప్తున్నారు. కావాలనే తమ ఉద్యమాన్ని కొందరు తప్పుదోవ పట్టించారని అంటున్నారు.

వారిలో ముఖ్యంగా పంజాబీ గాయకుడు, నటుడు దీప్ సిద్దూ పేరు అధికంగా వినిపిస్తుంది. మొదటి నుంచి రైతు ఉద్యమానికి తన మద్దతు ప్రకటించిన సిద్ధూ నిన్న ఎర్రకోట వద్ద జరిగిన అల్లర్లలో కూడా పాల్గొన్నాడు. అయితే ఎర్రకోటపై జాతీయ జెండాతో పాటుగా సిక్కు జెండాను కూడా ఎగురవేయడం వివాదాస్పదంగా మారింది.

ఈ నేపథ్యంలో దీప్ సిద్దునే కొంత మంది యువకుల ప్రేరేపించి ఎర్రకోటను ముట్టడించాలని, సిక్కు మత జెండాని ఎగురవేయాలని ఎర్రకోట పైకి పంపినట్టుగా భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) హర్యానా విభాగం నేత గుర్నామ్ సింగ్ చౌదాని ఆరోపించారు. అక్కడకు వెళితే మన ఆందోళన సక్సెస్ అవుతుందని ప్రసంగించినట్టుగా పేర్కొన్నారు.

అయితే ఈ రైతుసంఘాల ఆరోపణలను దీప్ సిద్ధూ తీవ్రంగా ఖండించారు. వేలాది మంది రైతులను తానొక్కడినే ఈ విధంగా ప్రోత్సహించగలనని ప్రశ్నించారు. కాగా దీప్ సిద్ధుకు కొందరు బీజేపీ నేతలతో కూడా సంబంధం ఉందని 2019 లో ఓ బీజేపీ ఆర్యకర్త తరపున ప్రచారం లో పాల్గొన్నాడని ఆరోపిస్తున్నారు. సిద్దు మోదీతో కలిసి దిగిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో దీనిని కాగ్రెస్ పార్టీ అస్త్రంగా మార్చుకుని నిన్న జరిగిన అల్లర్లలో బీజేపీ హస్తం ఉందంటూ విమర్శలు చేస్తుంది.

Related News