చిత్తూరు, గుంటూరు జిల్లాలో ఏకగ్రీవాలను అడ్డుకోవడంతో వైసీపీ నేతలు ఎన్నికల సంఘం పై నిప్పులు చెరుగుతున్నారు. ఆ రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలు కాకూడదా? అని వారి ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కమిషనర్, జిల్లా అధికారులపై నిన్న మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగుతుంది.
నిమ్మగడ్డ ఆదేశాలను పాటించి ఏకగ్రీవాలు జరుగకుండా అడ్డుపడితే ఆ అధికారులను బ్లాక్ లిస్టులో పెడతామని మంత్రి మీడియాతో వెల్లడించారు. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ మంత్రి పెద్ది రెడ్డిపై చర్యలకు ఆదేశించారు. ఈ నెల 21 వరకు ఆయనను ఇంటి నుంచి బయటకు రానివ్వద్దని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఆదేశాలు జారీ చేశారు. ఆయనను మీడియాతో కూడా మాట్లాడనివ్వద్దని పేర్కొన్నారు. మంత్రి పెదిరెడ్డి వ్యాఖ్యలతో ఎన్నికల విధులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఎస్ఈసీ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో డీజీపీ సవాంగ్ నిమ్మగడ్డ ఆదేశాలను పాటిస్తారా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పెద్దిరెడ్డిని బర్తరఫ్ చేయాలంటూ టీడీపీ గవర్నర్ ను కోరిన విషయం తెలిసిందే. కాగా ఈ వివాదంపై తాజాగా డీజీపీ స్పందించారు. ఎన్నికల కమిషనర్ నుంచి తనకు ఎలాంటి ఆదేశాలు అందలేదని ఆయన మీడియాకు వెల్లడించారు.