logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

సీజ్ చేసిన వాహ‌నాలు తిరిగి ఇచ్చేయండి.. డీజీపీ ఆదేశాలు

లాక్‌డౌన్ స‌మ‌యంలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా రోడ్డెక్కిన వాహ‌నాల‌ను పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డే సీజ్ చేశారు. అత్య‌వ‌స‌రం కాకుండా అన‌వ‌స‌రంగా రోడ్డుపై తిరిగిన వారిని పోలీసులు ఆపి వాహ‌నాలు సీజ్ చేసి ఆయా స్వాధీనం చేసుకున్నారు. చాలా చోట్ల వంద‌ల సంఖ్య‌లో వాహ‌నాలు సీజ్ అయ్యాయి. సీజ్ అయిన వాటిల్లో ద్విచ‌క్ర వాహ‌నాలు, ఆటోలు, కార్లు ఉన్నాయి.

కాగా, వీటిని తిరిగి వాహ‌న‌దారుల‌కు ఇచ్చేయాల‌ని తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి అన్ని పోలీస్ స్టేష‌న్ల‌కు ఆదేశాలిచ్చారు. వాహ‌న‌దారులు త‌మ వాహ‌నాల‌కు సంబంధించిన ఒక జ‌త జిరాక్స్ ప‌త్రాల‌ను పోలీసుల‌కు అంద‌జేసి, విధించిన జ‌రిమానాను చెల్లించి వాహ‌నాల‌ను తీసుకోవ‌చ్చు. వారంలోగా సీజ్ చేసిన వాహ‌నాల‌ను పార‌దర్శ‌క రీతిలో వాహ‌న‌దారుల‌కు అందించేయాల‌ని డీజీపీ పోలీసుల‌కు ఆదేశాలిచ్చారు.

కాగా, ఇప్ప‌టికే తెలంగాణ‌లో లాక్‌డౌన్‌ను ఇప్ప‌టికే చాలావ‌ర‌కు స‌డ‌లించిన సంగ‌తి తెలిసిందే. గ్రీన్ జోన్‌, ఆరెంజ్ జోన్‌ల‌లో సాధార‌ణ జీవ‌నం మొద‌లైంది. వివిధ రంగాల కార్య‌క‌లాపాలు మొద‌ల‌య్యాయి. రెడ్ జోన్‌ల‌లో కూడా ప‌లు సండ‌లింపులు ఇచ్చారు. దీంతో వాహ‌నాలు పెద్ద ఎత్తున రోడ్డెక్కుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే సీజ్ చేసిన వాహ‌నాల‌ను కూడా తిరిగి ఇచ్చేయాల‌ని పోలీసు శాఖ నిర్ణ‌యించింది.

Related News