logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ డెడికేటెడ్ ఫ్రెయిట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్‌సీసీఐఎల్) నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ల నియామకాలను చేపట్టనుంది. వివిధ శాఖల్లో మొత్తం ఖాళీలను కలుపుకుని 1074 పోస్టులు ఉన్నాయి.

విభాగాల వారీగా ఖాళీలను పరిశీలిస్తే.. జూనియర్ మేనేజర్ విభాగంలో 111 ఖాళీలు ఉన్నాయి. 442 ఎగ్జిక్యుటివ్ పోస్టులు, 521 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి విద్యార్హతలు ఉన్నాయి. బీఈ, బీటెక్, డిప్లొమా, పదో తరగతిలో ఐటిఐ పూర్తి చేసిన వారు అర్హులు. ఆపరేషన్ విభాగంలో ఉన్న ఖాళీలకు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన వారు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ప్రారంభ వేతనం నెలకు రూ. 50 వేల రూపాయల నుంచి 25 వేల వరకు ఉంది.

పోస్టును బట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్యూలో సెలక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టు నిర్వహించి తుది ఫలితాలను ప్రకటిస్తారు.

జూనియర్ మేనేజర్ పోస్టుకు అప్లై చేసుకునేవారు జనవరి 1 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ లకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖ పట్నంలో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు జూనియర్ మేనేజర్ పోస్టుకు 1000 రూపాయలు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ లకు 900, జూనియర్ ఎగ్జిక్యూటివ్ లకు 700 లుగా నిర్ణయించారు. ఏప్రిల్ 24 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. మే 23 చివరి తేదీ.

ఈ నోటిఫికేషన్ కు సంబందించిన పూర్తి సమాచారం కోసం (www.dfccil.com) వెబ్ సైట్ ను చూడవచ్చు.

Related News