logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త..!

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త వినిపించింది. లాక్ డౌన్ కారణంగా మూతపడిన శ్రీవారి దర్శనాలు తిరిగి ప్రారంబిస్తున్నట్టుగా తెలిపింది. ఈ నెల 11వ తేదీ నుండి తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి భక్తులను అనుమతించనున్నట్టుగా టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సాధారణ దర్శనానికి మాత్రమే అనుమతులు జారీ చేస్తునట్టుగా ప్రకటించారు. అయితే దర్శనానికి వచ్చే భక్తుల్లో 10 సంవత్సరాల లోపు పిల్లలు, 65 ఏళ్ళు పైబడిన వారికీ అనుమతించబోమని స్పష్టం చేసింది. దర్శనానికి వచ్చే భక్తులకు కొన్ని తాత్కాలిక ఆంక్షలు విధించింది టీటీడీ.

ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7:30 గంటల లోపే దర్శనానికి అనుమతించనున్నారు. భక్తులు ఆన్ లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలని, అలిపిరి గేటు వద్ద కూడా టికెట్ బుక్ చేసుకోవాలని తెలిపారు. వీఐపీ దర్శనానికి కేవలం గంట మాత్రమే అనుమతినిస్తున్నామన్నారు. శ్రీవారి మెట్టు మార్గాన్ని మరికొన్ని వరకు తెరవలేమని స్పష్టం చేసింది. పుష్కరిణిలో స్నానాలకు భక్తులను అనుమతించబోము. అలిపిరి గేటు వద్ద ప్రతి ఒకరికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తామని ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.

Related News