logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

షాకింగ్: కరోనా సోకిన వ్యక్తులకు డెంగ్యూ వస్తే..?

కరోనా వైరస్ ప్రపంచాన్నివణికిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో ఇప్పటికే కరోనా కేసులు 2.87 లక్షలు దాటిపోయింది. ఇప్పటివరకు కరోనాకు వాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఎప్పుడు వాటిస్తుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు వర్షాల కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో ఈ వర్షాల వలన ఎటు నుంచి వచ్చి కరోనా అంటుకుంటుందో అని ప్రజలు భయపడుతున్నారు.

ఇప్పుడు కరోనాకు తోడు మరో ముప్పు పొంచి ఉందంటున్నారు నిపుణులు. వాతావరణం చల్లబడితే కరొనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న సమయంలో వర్షాలు కురవడం మరింత ప్రమాదకరంగా మారనుంది. సీజనల్ వ్యాధుల్లో ఎక్కువగా వ్యాప్తి చెందే డెంగ్యూ ఇప్పుడు కలవరపెడుతుంది. కరోనా కాలంలో ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలను హరించే ఈ వ్యాధి కరోనా ఉన్న వారికి శాపంగా మారుతుందంటున్నారు. కరోనా సోకిన వ్యక్తులకు డెంగ్యూ సోకినా.. డెంగ్యూ ఉన్నవారికి కరోనా సోకినా కూడా వారి ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడుతుందంటున్నారు. కరోనాకు వాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు ఈ జాగ్రత్తలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Related News