ఆధార్ కార్డు వినియోగదారులు సాధారణంగా ఆధార్ సేవలను పొందడానికి ఎంఆధార్ యాప్ ను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ యాప్ ను వేంటనే డిలీట్ చేయాలని యూజర్లంతా లేటెస్ట్ వెర్షన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని యూఐడీఏఐ జారీ చేసింది. దీని కోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎంఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే యాపిల్ యూజర్లు అయితే యాప్ స్టోర్ నుంచి ఎంఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.
13 భాషల్లో అందుబాటులో ఉన్న ఈ యాప్ లో ఆధార్ కు సంబందించిన మొత్తం 35 రకాల సేవలను పొందవచ్చు. ఆధార్ డౌన్లోడ్, అప్డేట్ స్టేటస్ చెక్ చేసుకోవడం, ఆధార్ సెంటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవడం, బయోమెట్రిక్స్ లాక్, అన్లాక్ ఇలా అనేక రకాల సేవలను ఆన్ లైన్ ద్వారా పొందవచ్చు. కాగా ఈ యాప్ ను ఉపయోగిస్తున్నవారు యూఐడీఏఐ సూచించిన విధంగా దీనిని అన్ ఇంస్టాల్ చేసి కొత్త యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని వినియోగించడం మంచిది.