logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

భారత్- చైనా సరిహద్దుల్లో రాజ్ నాథ్ సింగ్.. తుపాకీ గురి పెట్టి..

భారత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లఢక్ లో పర్యటించారు. ఒక వైపు పాకిస్థాన్ మరో వైపు చైనా భారత్ పై కవ్వింపు చర్యలకు పాలపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రధాని మోడీ లఢక్ లో ఆకస్మిక పర్యటన చేపట్టి క్షేత్ర స్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ చైనా సరిహద్దుల్లో పర్యటించడం ఆసక్తికరంగా మారింది.

భారత్ సైనిక సన్నద్ధతను ఆయన పరిశీలించారు. శుక్రవారం ఉదయం లేహ్ విమానాశ్రయానికి చేరుకున్నరాజ్ నాథ్ కు సైనికాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక విమానంలో లఢక్ కు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా భారత్ సైన్యం యుద్ధ విన్యాసాలను, భారత అత్యాధునిక ఆయుధాల ప్రదర్శనను మంత్రి వీక్షించారు. ఈ క్రమంలో ఆయన అడ్వాన్స్డ్ గన్ ను పరీక్షిస్తూ తుపాకిని గురి పెట్టి చూసారు.

అనంతరం సైనికాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈరోజు, రేపు రెండు రోజులపాటు ఆయన పర్యటన కొనసాగనుంది. శనివారం శ్రీనగర్ కు వెళ్లనున్నారు. పాకిస్థాన్ సరిహద్దుల్లో భద్రతా విధుల్లో ఉన్నబలగాలతో మాట్లాడనున్నారు. ఈ పర్యటనలో రాజనాథ్ సింగ్ తో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే ఉన్నారు.

Related News