logo

  BREAKING NEWS

రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |   కేంద్రంపై రైతుల దండయాత్ర ఎందుకు? నూతన వ్యవసాయ చట్టాల్లో ఏముంది?  |  

ప్రభాస్ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్: కింగ్ కు సరిపోయే క్వీన్ దొరికింది

ప్రభాస్ అభిమానులకు గొప్ప సర్ప్రైజ్ ఇవ్వబోతున్నామని వైజయంతి మూవీస్ వారు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సర్ప్రైజ్ ను ప్రేక్షకుల ముందుంచారు. ప్రభాస్ 20 వ సినిమా గా ‘రాధే శ్యామ్’ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ 21 సినిమా రాబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా ఎవరు నటించబోతున్నారని విషయం పై కొంత కాలంగా చర్చ జరుగుతుంది.

కొందరు హీరోయిన్ల పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. అందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకునే పేరు ఎక్కువగా వినిపించింది. కాగా ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ వైజయంతి క్రియేషన్స్ ప్రభాస్ సినిమాలో నటించబోయే హీరోయిన్ ను అధికారికంగా ప్రకటించింది. అందరూ ఊహించినట్టుగానే దీపికానే ప్రభాస్ సరసన నటిస్తున్న విషయాన్నీ కన్ఫర్మ్ చేసింది. సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ‘కింగ్ కు సరిపోయే క్వీన్ దొరికేసింది’ అంటూ ట్వీట్ చేసారు.

దీంతో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విషయాన్నీ వైజయంతి బ్యానర్ ఒక వీడియో ద్వారా తెలిపింది. ఇప్పటివరకు ఎందరో హీరోయిన్లు తమ బ్యానర్ లో నటించారని ఇపుడు తమ తాజా చిత్రంలో దీపికా పడుకునే ను హీరోయిన్ గా ప్రకటిస్తున్నట్టుగా తెలిపింది. ఆమెకు స్వాగతం పలుకుతూ ఈ వీడియోను విడుదల చేసింది. బాహుబలి సినిమాతో ప్రభాస్ హిందీలోనూ స్టార్ హీరోగా మారిపోయాడు. ఉప్పుడు దీపికతో కలిసి ప్రభాస్ నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Related News