logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

కరోనాతో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావుద్ ఇబ్రహీం మృతి..?

ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడైన దావుద్ ఇబ్రహీం కరోనాతో మృతి చెందాడన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కొన్ని జాతీయ వెబ్ సైట్లు కూడా ఈ వార్తలు ప్రచురిస్తున్నాయి. పాకిస్థాన్ కరాచీ లోని ఐఎస్ఐ ఆశ్రమంలో తలదాచుకున్న దావుద్ ఇబ్రహీం కు అతని భార్య మెహజబీన్ కు కరోనా సోకినట్టుగా శుక్రవారం సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

ఈ క్రమంలో కరోనా చికిత్స పొందుతూ దావుద్ మరణించాడని పాకిస్థాన్ కు చెందిన న్యూస్ ఎక్స్ మీడియా శనివారం ఓ కథనం లో పేర్కొంది. ఈ వార్తలపై స్పందించిన అతని సోదరుడు అనీస్ ఇబ్రహీం దావూద్‌కు, అతని కుటుంబ సభ్యులకు ఎవ్వరికీ కరోనా పరీక్షలు నిర్వహించలేదని తెలిపాడు.. వారందరూ తమ ఇంట్లో ఉన్నారని కూడా చెప్పాడు. అయితే దావుద్ మరణానికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త హల్ చల్ చేస్తుంది. ఈ వార్తతో నెటిజన్లు భారత్ తో సహా ప్రపంచ దేశాలు చేయలేని పనిని కరోనా చేసిందని కామెంట్లు పెడుతున్నారు. 1993 లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో దోషిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న దావూద్ 25 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు.

Related News