అల్లు అర్జున్ నటించిన అల వైకంఠపురములో సినిమాలోని బుట్ట బొమ్మ పాటకు స్టెప్పులు వేయడం చాలా కష్టమని ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అన్నారు. లాక్డౌన్ కారణంగా క్రికెట్ మ్యాచ్‌లు లేకుండా ఇళ్లకే పరిమితమైన క్రికెటర్లు ఇన్స్టాగ్రామ్ లైవ్‌లలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చర్చిస్తున్నారు. ఇలానే టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో డేవిడ్ వార్నర్ మాట్లాడాడు. ఈ మధ్య టిక్ టాక్ వీడియోలు బాగా చేస్తున్నట్లున్నావు, ఓ తెలుగు పాటకు డ్యాన్స్ చేశావు కదా అని వార్నర్‌ను రోహిత్ శర్మ ప్రశ్నించాడు.
అవును.. నా కూతురి వల్ల టిక్ టాక్ వీడియోలు చేయడం అలవాటైంది. బుట్ట బొమ్మ పాటకు స్టెప్పులు వేయడం చాలా కష్టమనిపించింది. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలకు డ్యాన్సులు చేయడం కష్టమే అని వార్నర్ అభిప్రాయపడ్డాడు. ఇక, క్రికెట్ గురించి కూడా వీరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఈ ఏడాది జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ జరిగే అవకాశం లేదని వార్నర్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది చివర్లో భారత్ – ఆస్ట్రేలియా సిరీస్‌తో మళ్లీ క్రికెట్ మొదలు కావొచ్చని చెప్పాడు.