logo

  BREAKING NEWS

అన్న‌మ‌య్య జిల్లా పూర్తి వివ‌రాలు  |   తూర్పు గోదావ‌రి(రాజ‌మ‌హేంద్ర‌వ‌రం) జిల్లా పూర్తి వివ‌రాలు  |   ఎన్‌టీఆర్ కృష్ణా జిల్లా పూర్తి వివ‌రాలు  |   శ్రీబాలాజీ తిరుప‌తి జిల్లా పూర్తి వివ‌రాలు  |   ఎంపీ ప‌ద‌విపై క‌న్నేసిన రాజాసింగ్‌.. అక్క‌డి నుంచి పోటీ  |   షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |  

దాసరి కోసం సినీ పెద్దలు ముందుకొస్తారా..?

దర్శకుడి పేరుకి ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చి, దర్శకుడి స్థాయిని సగర్వంగా పెంచిన వ్యక్తి దాసరి నారాయణరావు. తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉంటూ ఇండస్ట్రీలో ఎలాంటి చిన్న సమస్య తలెత్తినా సమస్యను పరిష్కరించడానికి ముందుండేవారు. అవసరమైతే ఆదేశించేవారు. అలాంటిది ఇప్పుడు ఆయన కుమారులు ఆస్థి వివాదాల కోసం రోడ్డెక్కారు. ఒకరిపై ఒకరి ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్లిందీ వ్యవహారం.

ఇది సినీ పరిశ్రమలో కొంత మందికి ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే వారంతా దాసరి ప్రోత్సాహంతోనే పరిశ్రమలో నిలదొక్కుకున్న వారు. ఇప్పుడు వారి కుమారులే తమ ఆస్థి పంపకాల కోసం ఈ విధంగా దాసరి ప్రతిష్టకు భంగం కలిగేలా చేస్తున్నారని భావిస్తున్నారట. ఈ విషయంలో సినీ పెద్దలు కల్పించుకోవాలి అని దాసరి కుమారులు కోరుతున్నారు.

అయితే దాసరి నారాయణ రావు స్వయంగా తన కుమారుల ఆస్థి పంపకాలను చేయాలని మోహన్ బాబు, మురళి మోహన్ పేర్లను రాసి వెళ్లిపోయారు. ఈ వివాదం దాసరి మరణం తర్వాతనే మొదలైంది. అయితే అప్పట్లోనే వీరు ఆయన కుమారుల ఆస్థి పంపకాలను చేయాలని ముందుకొచ్చారట, కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు మాట వినకపోవడంతో అది సాధ్యపడలేదట.

మళ్ళీ ఇప్పుడు దాసరి పెద్ద కుమారుడు ప్రభు మీడియా ముఖంగా సినీ పెద్దల పేరెత్తారు. తమను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, తండ్రి మరణం తర్వాత ఒంటరి వారమయ్యాయని ఆవేదన వక్తం చేసారు. ఈరోజు దాసరి అరుణ్ ప్రెస్ మీట్ పెట్టి అదే విషయాన్ని స్పష్టం చేసాడు. మరి ఇప్పటికైనా మోహన్ బాబు లాంటి వారు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారో లేదో చూడాలి.

Related News