logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!

కరోనా మహమ్మారీ నుంచి ప్రపంచం పూర్తిగా ఎప్పుడు కోలుకుంటుందో పరిస్థితి ఏర్పడింది. ఈ వైరస్ నుంచి బయటపడకముందే కొత్తగా జీ4 వైరస్ చైనా ను కబళించేందుకు సిద్దమయ్యింది. ఈ వైరస్ పై పరిశోధనలు జరుగుతున్న సమయంలోనే తాజాగా చైనాలో మరో మహమ్మారి వెలుగులోకి వచ్చింది. దీనిని ‘బుబోనిక్ ప్లేగు’ గా పిలుస్తున్నారు. ఇది ఇటీవల వెలుగు చూసిన జీ 4 వైరస్ కన్నా, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కన్నా కూడా అత్యంత ప్రమాదకారిగా గుర్తించారు. ఈ వ్యాధి సోకిన 24 గంటలోపు వ్యక్తి మరణించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇది చైనాకు చెందినది కాకపోయినా చైనాలోనే దీని మూలాలు బయటపడ్డాయి కాబట్టి అక్కడ ఈ వ్యాధి విజృంభించే అవకాశాలు ఉన్నాయి. చైనా సరిహద్దులోని మంగోలియాలో ఇద్దరు వ్యక్తుల్లో ఈ వ్యాధిని నిర్దారించారు. వీరిని వేర్వేరుగా ఉంచి చికిత్సను అందిస్తున్నారు. కాగా వీరితో పాటు సంబంధం ఉన్న 146 మందిని ఐసోలేషన్ కు తరలించారు. ఈ వ్యాధి కారణంగా ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్ లో ఈ ఏడాది చివరి వరకు మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేసారు.

బుబోనిక్ ప్లేగు వ్యాధికి కూడా అడవి జంతువుల ద్వారానే సోకుతుండటం గమనార్హం. ముర్మోట్ అనే ఉడుత జాతి మాంసం తినడం వల్ల ఇది మనుషులకు వ్యాపిస్తుంది. దీంతో ప్రజలు ఈ మాంసాన్ని తినవద్దని ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. 2003లో చైనాను కుదిపేసిన సార్స్, ఇప్పుడు కరోనా వైరస్ కూడా గబ్బిలాల నుంచే పుట్టాయని అనుమానిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బుబోనిక్ ప్లేగు ఇప్పటికిప్పుడు కొత్తగా పుట్టుకొచ్చినది కాదంటున్నారు పరిశోధకులు. ‘బ్లాక్ డెత్’ గా పిలిచే బుబోనిక్ ప్లేగుకు కు వందల ఏళ్ల చరిత్ర ఉంది. 1347లో యూరప్ దేశాలను గజగజ వణికించిన జస్టీనియస్ బాక్టీరియా మళ్ళీ 800 ఏళ్ళ తర్వాత బుబోనిక్ ప్లేగు వ్యాధిగా రూపాంతరం చెందింది. ఇది చైనాలో విజృంభించేనుకు సిద్ధంగా ఉందని పరిశోధకులు చెప్తున్నారు. అప్పట్లోనే ఈ వైరస్ 20 కోట్ల మందికి పైగా బలి తీసుకుంది. ఒక్క చైనాలోనే ఈ వ్యాధి భారిన పడి 63 వేల మంది మరణించారు. అయితే ఈ వైరస్ ను ఎలా అరికట్టాలో తెలియకపోయినా ఒకరి ద్వారా ఒకరికి వ్యాపిస్తుండటం ప్రజలు గ్రహించారు.

ఈ వ్యాధి సోకిన వారిని క్వారెంటైన్ చేయడం మొదలు పెట్టారు. అలా వీరి కోసం ప్రత్యేకించి ఒక ప్రాంతం ఏర్పాటు చేసి అక్కడే వీరిని ఉంచేవారు. సముద్ర మార్గాల్లో ఓడల ద్వారా వచ్చిన వారి వల్ల ఈ వైరస్ ఇతర దేశాలకు వ్యాపిస్తుంది గుర్తించిన అప్పటి రోమన్ పాలకులు వాటిపై ఆంక్షలు విధించారు. అప్పట్లోనే వీరిని 40 రోజులపాటు క్వారెంటైన్ చేసి వ్యాధి లక్షణాలు లేవని పూర్తిగా నిర్దారించినుకున్న తర్వాతే రాజ్యంలోకి అనుమతిచ్చేవారట. అయినా కూడా వ్యాధిని అరికట్టలేకపోయారు. యూరప్ దేశాలపై విడతల వారీగా అనేకసార్లు ఈ వ్యాధి విజృంభించి లక్షల మంది ప్రాణాలను హరించింది. ఈ వ్యాధి సోకకుండా స్వీయ జాగ్రత్తలు పాటించిన వారు మాత్రమే బతికిబట్టగట్టారు. చరిత్రలో ఇదొక భయానక సంఘటనగా మిగిలిపోయింది. మళ్ళీ ఊహించని విధంగా 2015లో ఈ వ్యాధిని మంగోలియాలో గుర్తించారు. గతేడాది వరకు ఈ వ్యాధికి కారణమవుతున్న ముర్మూట్ జాతి జంతువులను తిని 3వేలకు పైగా దీని బారిన పడగా వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీకొత్త కేసులు నమోదవుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది.

Related News