logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

మీ ఫోన్‌లో ఈ 21 యాప్‌లు ఉన్నాయా ? ‌వెంట‌నే డిలీట్ చేసేయండి !

ఎప్పుడూ స్మార్ట్‌ఫోన్ల యూజ‌ర్ల స‌మాచారాన్ని సేక‌రించ‌డం, స్మార్ట్‌ఫోన్ల‌లోకి ప్ర‌మాద‌క‌ర‌మైన మాల్‌వేర్‌ను పంపించి ఫోన్లు స‌రిగ్గా ప‌ని చేయ‌కుండా చేయ‌డం వంటివి చేస్తుంటారు సైబర్ నేర‌గాళ్లు. ఇలాంటి ప్ర‌మాద‌క‌ర‌మైన యాప్‌లు ప్లేస్టోర్‌లో కూడా ఉంటాయి. వీటిని మ‌న‌కు అవ‌స‌రం ఉన్నా, లేక‌పోయినా కొంద‌రు డౌన్‌లోడ్ చేసుకొని ఉప‌యోగిస్తుంటారు. ఇలా ఉప‌యోగించే వారి ఫోన్లు పాడ‌వ‌డంతో పాటు మ‌న వ్య‌క్తిగ‌త స‌మాచారానికి కూడా ఇబ్బందే.

మ‌న ఫోన్ల‌కు న‌ష్టం చేసే ప్ర‌మాద‌క‌ర‌మైన యాడ్స్ మాల్‌వేర్ ఉన్న 21 యాప్‌ల జాబితా విడుద‌ల చేసింది సైబ‌ర్ రిసెర్చ‌ర్స్ బృందం. గూగుల్‌తో క‌లిసి ఈ ప‌రిశోధ‌న బృందం ప్ర‌మాద‌క‌ర‌మైన యాప్‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు గుర్తించి, స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తుంది. తాజాగా ప్ర‌క‌టించిన 21 ప్ర‌మాద‌క‌ర‌మైన యాప్‌ల‌ను వెంటనే డిలీట్ చేయాల‌ని వీరు ప్ర‌క‌టించారు.

ఎక్కువ‌గా గేమింగ్‌కు సంబంధించిన యాప్‌లే ఈ లిస్టులో ఉన్నాయి. ఇప్ప‌టికే ప్లే స్టోర్ నుంచి ఈ 21 యాప్‌ల‌కు 80 ల‌క్ష‌ల డౌన్‌లోడ్‌లు ఉన్నాయి. మ‌న‌లోనూ చాలామంది ఫోన్‌ల‌లో ఈ లిస్టులోని యాప్‌లు ఉండే ప్ర‌మాదం ఉంది. ఒక‌వేళ అలా ఉన్న‌ట్ల‌యితే వెంట‌నే డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ల‌ను తొల‌గించారు. కానీ, డౌన్‌లోడ్ చేసుకున్న వారి ఫోన్‌ల‌లో మాత్రం అలానే ఉన్నాయి.

ఈ 21 ప్ర‌మాద‌క‌ర‌మైన యాప్‌ల జాబితాలో… షుట్ ధెమ్‌, క్ర‌ష్ కార్‌, రోలింగ్ స్క్రోల్‌, హెలీకాఫ్ట‌ర్ అటాక్‌, హెలీకాఫ్ట‌ర్ షూట్‌, ర‌గ్బీ పాస్‌, ఫ్లైయింగ్ స్కేట్‌బోర్డ్‌, ఐర‌న్ ఇట్‌, షూటింగ్ ర‌న్‌, ప్లాంట్ మాన్‌స్ట‌ర్‌, ఫైండ్ హిడ్డెన్‌, ఫైండ్ ఫైవ్ డిఫ‌రెన్సెస్‌, రొటేట్ షేప్‌, జంప్‌, జంప్‌, ఫైండ్ ధి డిఫ‌రెన్సెస్‌, స్వేమ్యాన్‌, డెసెర్ట్ అగైనెస్ట్‌, మ‌నీ డెస్ట్రాయ‌ర్‌, క్రీమ్ ట్రిప్‌, ప్రాప్స్ రిస్క్యూ అనే యాప్‌లు ఈ ప్ర‌మాద‌క‌ర యాప్‌ల లిస్టులో ఉన్నాయి.

ఒక‌వేళ మీ ఫోన్‌ల‌లో క‌నుక ఈ యాప్‌లు ఉంటే వెంట‌నే డిలీట్ చేసుకోవాలి. ఎక్కువ‌గా పిల్ల‌ల‌కు సంబంధించి గేమింట్ యాప్‌లు ఇవి. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు పిల్ల‌ల‌కు ఎక్కువ‌గా ఇస్తున్నాం. ఇటువంటి గేమ్‌ల‌ను మ‌న‌మే ఇన్‌స్టాల్ చేయించి ఆడిస్తున్నాం. ఇవి వారికే కాకుండా మ‌న ఫోన్‌ల‌కు కూడా ప్ర‌మాద‌మే. కాబ‌ట్టి, ఇప్ప‌టికే గూగుల్ తొల‌గించిన ఈ యాప్‌ల‌ను మీరూ వెంట‌నే డిలీట్ చేసేయండి.

Related News