logo

  BREAKING NEWS

భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |   మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |   నువ్వు దేవుడివి సామీ.. 1020 మంది చిన్నారుల‌కు ప్రాణాలు పోసిన మ‌హేష్  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతున్న త్రివిక్ర‌మ్‌  |   తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |  

తన రొగ్య పరిస్థితి పై రానా చేదువార్త.. కంటతడి పెట్టుకున్న హీరో

టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా ఆరోగ్యంపై గతంలో అనేక వార్తలు వచ్చాయి. రానా కొంత కాలం అమెరికాకు వెళ్ళాడు. ఆ సమయంలో అతనికి కిడ్నీలకు సంబందించిన శస్త్ర చికిత్స జరిగిందని, అతని తల్లి రానాకు ఒక కిడ్నీ కూడా దానం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత అమెరికా నుంచి వచ్చిన రానా ఫోటోలు చూసి ఈ వార్త నిజమే అనుకున్నారు అంతా.

కండల వీరుడిగా ఉండే రానా ఒక్కసారిగా బక్కపలచగా కనిపించడంతో అభిమానులు కూడా ఆందోళనకు గురయ్యారు. కానీ ఆ తర్వాత ‘అరణ్య’ షూటింగ్ కోసం అయ్యుండవచ్చని లైట్ తీసుకున్నారు. కాగా రానా ఇప్పుడు మిహిక బజాజ్ ను పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. అయితే తాజాగా సమంత అక్కినేని నిరవహిస్తున్న ‘సామ్ జామ్’ అనే కార్యక్రమంలో రానా పాల్గొన్నాడు.

ఈ కార్యక్రమమం ఆహాలో విడుదల చేయనున్నారు. అయితే ఈ ప్రోగ్రాంలో రానా తన ఆరోగ్యం పై మొదటి సారి స్పందించాడు. తనకు కిడ్నీ స్మమస్య ఉన్నది నిజమే. ‘జీవితం వేగంగా ముందుకు వెళ్తోన్న సమయంలో అకస్మాత్తుగా ఒక చిన్న పాజ్ బటన్ వస్తుంది. పుట్టినప్పటి నుంచే బీపీ ఉంది. దీని వల్ల గుండెకు సమస్య తలెత్తుంది.. నీ కిడ్నీలు కూడా పాడవుతాయి అని చెప్పారు. స్ట్రోక్ హెమరేజ్‌ (మెదడులో నరాలు చిట్లిపోవడం)కు 70 శాతం, చనిపోవడానికి 30 శాతం ఛాన్స్ ఉంద’ని చెప్పారు.

ఆ సమయంలో రానా కంట తడి పెట్టుకోవడం ప్రతి ఒక్కరినీ కదిలించింది. అంతలో సమంత మాట్లాడుతూ అతని గురించి ప్రతి ఒక్కరు ఎదో ఒకటి మాట్లాడుతున్నా ఆ సమయంలో రానా ధైర్యంగా ఉండటం నేను చూశానని చెప్పుకొచ్చారు.

Related News