logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

తీరాన్ని తాకిన నిసర్గ తూఫాన్.. 130 ఏళ్ల తరువాత తొలిసారి

ఓవైపు కరోనా వైరస్ మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న సమయంలో నిసర్గ తూఫాను ఇప్పుడు మరో ముప్పుగా మారింది. నిసర్గ తూఫాన్ ధాటికి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ తూఫాన్ ఈరోజు మధ్యాహ్నం తీరాన్ని తాకినట్టుగా వాతావరణ విభాగం వెల్లడించింది. మహార్రాష్ట్రలోని రాయ్గడ్ జిల్లా అలీబాగ్ సమీపంలో తీరం దాటే ప్రక్రియ 3 గంటల పాటు కొనసాగుతుందని వెల్లడించింది.

తూఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగా ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను సహాయక చర్యలకు రంగంలోకి దింపారు. ఈ బృందాలు రాయ్ గడ్ జిల్లాలో ఇప్పటికే 13 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అటు గుజరాత్ రాష్ట్రంలోనూ తూఫాన్ ప్రభావం అధికంగా ఉన్న 7 గ్రామాలను ఖాళి చేయించారు. మరో 78 వేల మందిని గుజరాత్ ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

ప్రస్తుతం ముంబై మహానగరం తూఫాన్ ధాటికి చిగురుటాకులా వణుకుతుంది. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ ను విధించారు. 130 ఏళ్ల తరువాత తూఫాన్ ముంబై తీరాన్ని తాకడం ఇదే తొలిసారి. ఇక ప్రజలెవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసారు. విమానాల రాకపోకలను సైతం నిలిపివేశారు. విసర్గ తూఫాన్ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణితో ప్రధాని మోదీ మాట్లాడారు. విపత్తును ఎదుర్కోవడానికి కేంద్రం నుండి అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

Related News