logo

సినీ నటి, బీజేపీ నేత మాధవిలతకు ఊహించని షాక్..!

టాలివుడ్ హీరోయిన్, బీజేపీ నేత మాధవి లతకు ఊహించని షాక్ తగిలింది. సోషల్ మీడియాలో మాధవీలత ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. సామజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తారు. తాజాగా సోషల్ మీడియా వేదికంగా ఆమె కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాధవి లత పోస్టు చేసారని పలువురు మండిపడుతున్నారు.

కాగా ఈ విషయంపై వనస్థలిపురానికి చెందిన గోపీ కృష్ణ అనే విద్యార్థి ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. గోపీకృష్ణ ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు మాధవి లతపై 295-A సెక్షన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. కాగా ఇటీవల రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా సినీ విమర్శకుడు కత్తి మహేష్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

కత్తి మహేష్ ను కోర్టు ముందు హాజరుపరుచగా అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇప్పుడు మాధవిలతను కూడా పోలీసులు ఈ కేసుపై విచారించనున్నట్టుగా తెలుస్తుంది. ‘నచ్చావులే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మాధవీలత ఆ తరవాత అవకాశాలు తగ్గిపోవడంతో సినిమాలకు కొంత కాలం దూరంగా ఉన్నారు. బీజేపీలో చేరి పార్టీ తరపున చురుకుగా పాల్గొంటున్నారు. కాగా ఆమె నటిస్తున్న ‘లేడీ’ అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News