సైబర్ నేరగాళ్లు ఏకంగా పోలీసు ఉన్నతాధికారినే టార్గెట్ చేశారు. నల్గొండ ఎస్సీ ఫేస్బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేసి ఆయన పేరుపై డబ్బులు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ రంగనాథ్ షాక్‌కు గురయ్యారు. నల్గొండ ఎస్పీ రంగనాథ్ ఫేస్ బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆ అకౌంట్‌తో కొందరికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
తన భార్య పేరుకు డబ్బులు పంపించాలని చెబుతూ అనిత అనే ఓ ఒడిశా మహిళకు సంబంధించి అకౌంట్ వివరాలను పంపిస్తున్నారు. డబ్బులు పంపించిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి పంపించాలని సైతం డిమాండ్ చేస్తున్నారు. వీరి వ్యవహారంపై అనుమానం వచ్చిన వారు వెంటనే నల్గొండ ఎస్పీ రంగనాథ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.
తన అకౌంట్‌నే హ్యాక్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తుండటం పట్ల రంగనాథ్ కూడా షాక్‌కు గురయ్యారు. అసలు ఈ ఫేస్బుక్ అకౌంట్‌ను తాను రెండేళ్లుగా వాడటం లేదని ఆయన తెలిపారు. ఈ విషయమై తాను ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒడిశా నుంచి ఇలా చేస్తూ ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.