logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

పంచాయతీ ఎన్నికలు: ఏపీలో సీఎస్ వర్సెస్ ఎస్ఈసీ!

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలో అయన ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ ను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇటీవల అయన సీఎస్ కు వరుస లేఖలు రాయడం చర్చనీయాంశంగా మారింది. అంతే కాదు లేఖ రాసి ఆ తర్వాత తాను కోరిన విషయంపై స్పందన తెలియజేయాలని మరో లేఖను కూడా రాస్తున్నారు.

తాజాగా నిమ్మగడ్డ సీఎం ఓ కార్యాలయం అధికారిపై చర్యలు తీసుకోవాలని సీఎస్ ను కోరారు. అయితే తన ఆదేశాలు అమలు చేయకపోవడం పట్ల నిమ్మగడ్డ అసంతృప్తి వ్యక్తం చేసారు. సీఎంఓ కార్యాలయం ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ను విధుల నుంచి తొలిగించాలంటూ ఎస్ఈసీ ఏపీ సీఎస్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు తన ఆదేశాలు అమలు పరచకపోవడంపై ఎన్నికల కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సాధారణ పరిపాలనా అధిపతిగా ఉన్న ప్రవీన్ ప్రకాష్ తన విధులను సక్రమంగా నిర్వహించలేదని లేఖలో స్పష్టం చేసారు. వెంటనే అతన్ని విధుల నుంచి తొలగించాలని సూచించారు. తన ఆదేశాలను అమలు చేయకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని నిమ్మగడ్డ హెచ్చరించారు.

Related News