logo

  BREAKING NEWS

అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |   వ్యాయామం ఏ వయసు వారు ఎంతసేవు చేయాలి: డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలు  |   బ్రేకింగ్: మంత్రి పేర్ని నానిపై హ‌త్యాయ‌త్నం  |   తెలంగాణలో కరోనా అప్ డేట్.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?  |   ‘సర్జికల్ స్ట్రయిక్స్’ అంటే ఏమిటి? ఎలాంటి సందర్భాలలో నిర్వహిస్తారు?  |   బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |  

తాగి వాహనం నడిపితే పదేళ్ల జైలు… వారికీ శిక్షలు తప్పవు!

హైదరాబాద్ నగరంలో జరిగిన రెండు వేరు వేరు ప్రమాదాలు తాగి వాహనం నడిపిన కారణంగానే జరిగినట్టుగా పోలీసులు నిర్దారించారు. దీంతో మరోసారి పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనికీలు మరింత కఠినతరం చేస్తామన్నారు.

ఏసీఏ స్థాయి అధికారుల నేతృత్వంలో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దీనిపై చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాదు ఇకపై ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే పదేళ్లు జైలు శిక్ష తప్పదని సజ్జనార్ హెచ్చరించారు. ఒకవేళ పబ్బుల్లో అతిగా మద్యం సేవించిన వారి బాధ్యత ఆ పబ్బు నిర్వాహకులు, యజమానులదేనని స్పష్టం చేసారు.

వారిని క్షేమంగా ఇంటికి చేర్చాలన్నారు. మద్యం సేవించిన వారికి వాహనాలు ఇచ్చినా నేరమేనన్నారు. వాహన యజమానులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.

Related News