logo

  BREAKING NEWS

గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |   మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |  

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు సీపీ సజ్జనార్ కౌంటర్!

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మండిపడ్డారు. పోలీసులపై ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని లీగల్ నోటీసులు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమే. అయితే ఈ మధ్య కాలంలో ప్రతి పక్ష నేతలు పోలీసు అధికారుల తీరుపై కూడా తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

దీనిపై తాజాగా సీపీ సజ్జనార్ స్పందించారు. పోలీసుల మీద, డిజిపి పైన కామెంట్స్ చేయడం రాజకీయ నేతలకు ఫ్యాషన్ అయ్యిందన్నారు. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ పోలీసుల మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇటీవల పోలీసులపై బీజేపీ ఎమ్మెల్యే రాజేసింగ్ చేసిన వ్యాఖ్యలపై లీగల్ నోటీసులు తీసుకుంటామని సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ నేతలు పోలీసుల మొరాలిటీ దెబ్బతీసే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. ఇకపై వారు కేసులు ఎదుర్కోక తప్పదన్నారు.

Related News