logo

  BREAKING NEWS

కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |   ‘గుంటూరు’కు చెందిన కోహినూర్ వజ్రం బ్రిటన్ చేతికి ఎలా వెళ్ళింది?  |  

బ్రేకింగ్: హైదరాబాద్ కు కరోనా వాక్సిన్!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేయడానికి మరో నాలుగు రోజుల్లో వాక్సిన్ రాబోతుంది.అందుకోసం ఒకేసారి రెండు వాక్సిన్ లు సిద్ధమయ్యాయి. జనవరి 16 వ తేదీన దేశవ్యాప్తంగా కరోనా వాక్సిన్ పంపిణీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

సీరం ఇన్స్టిట్యూట్ రూపొందించిన కోవిషీల్డ్ వాక్సిన్ ను ఈరోజు తెల్లవారు జామున దేశంలోని వివిధ ముఖ్య ప్రాంతాలకు తరలించారు. ఈ మేరకు పూణే నుంచి ఈరోజు ఉదయం 10 గంటలకు కోవిషీల్డ్ వాక్సిన్ హైదరాబాద్ కు చేరుకుంది. పూణే లోని తయారీ కేంద్రం నుంచి కట్టుదిట్టమైన భద్రతల నడుమ వాక్సిన్ ను మూడు ప్రత్యేకమైన ట్రక్కులు ద్వారా తరలించారు.

తొలి విడతలో భాగంగా కోల్ కతా, చెన్నై. బెంగుళూరు, కర్నూల్, హైదరాబాద్ విజయవాడ, గౌహతి, లఖన్ పుర్, చండీఘడ్, భువనేశ్వర్, కు తరలించారు. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. హైదరాబాద్ కు తో లి విడతగా 3. 72 లక్షల వాక్సిన్ డోసులు అందనున్నాయి.

మరికొద్ది సేపటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వాక్సిన్ చేరనుంది. అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి తరలించనున్నారు. వాక్సిన్ పంపిణీ ప్రక్రియలో భాగంగా మొదట కరోనా ఆవరియర్లకు వాక్సిన్ వేయనున్నారు. ఆ తర్వాత 50 ఏళ్ళు పైబడిన వారికి, 50 ఏళ్ళు పై బడి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వాక్సిన్ ను వేయనున్నారు.

మరోవైపు భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ ను దేశంలోని 12 రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. మంగళవారం మొదలు కానున్న ఈ ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి కానుందని సంస్థ ప్రకటిచింది.

Related News