కరోనాకి వాక్సిన్ వచ్చేసింది. జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా వాక్సిన్ ను పంపిణి చేయనున్నారు. అందులో భాగంగా ముందుగా కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఆ తర్వాత క్రమంగా మిగిలిన ప్రజలకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవి షీల్డ్ వాక్సిన్ ధరపై సీరం సంస్థ కీలక ప్రకటన చేసింది.
భారత ప్రభుత్వం అభ్యర్థన మేరకు వాక్సిన్ ను ప్రత్యేక ధరకే అందిస్తున్నామన్నారు. ఈ మేరకు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనియావాలా మాట్లాడుతూ.. వాక్సిన్ ను ప్రభుత్వానికి రూ. 200 లకే అందిస్తున్నామన్నారు. అయితే ప్రైవేట్ మార్కెట్లో మాత్రం ఒక్క డోసు రూ. 1000 రూపాయలు ఉండనుందన్నారు.
అయితే కేంద్ర ప్రభుత్వానికి కూడా 10 కోట్ల డోసులకు మాత్రమే రూ. 200 ప్రత్యేక ధర ఉంటుందన్నారు. సాధారణ, పేద ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.