logo

  BREAKING NEWS

ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |   అప్ప‌టినుంచే రామ్‌తో ప‌రిచ‌యం.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన సునీత  |   ఏపీ గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం జరుగుతోంది?  |   బ్రేకింగ్: హైదరాబాద్ కు కరోనా వాక్సిన్!  |   బ్రేకింగ్ : ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ!  |  

క‌రోనా వ్యాక్సిన్ కావాలా ? ముందు ఈ యాప్‌లో న‌మోదు చేసుకోండి !

ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న క‌రోనా వైర‌స్ పుట్టి ఏడాది గ‌డిచింది. ఏడాది కాలంగా క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుందా అని అంద‌ర‌మూ ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు అంద‌రి ఎదురుచూపులూ ఫ‌లించే స‌మయం ద‌గ్గ‌ర ప‌డింది. మ‌రో నెల‌, రెండు నెల‌ల్లో క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే జ‌న‌వ‌రి రెండో వారంలోనే వ్యాక్సిన్ వ‌చ్చే ఛాన్సులు కూడా ఉన్నాయ‌ని తెలుస్తోంది.

కాబ‌ట్టి వ్యాక్సిన్‌ను సువిశాల భార‌త‌దేశంలో మారుమూల ప్రాంతాల‌కు కూడా చేర్చేలా, అంద‌రికీ అందించేలా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాయి. వ్యాక్సిన్‌ను విడ‌త‌ల‌వారీగా పంపిణీ చేయ‌నున్నారు. వ్యాక్సిన్‌ను నిల్వ ఉంచేందుకు అన్ని రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు ఏర్పాట్లు కూడా పూర్తి చేశాయి. అన్ని ప్రాంతాల‌కు వ్యాక్సిన్‌ను చేర్చేందుకు ప్ర‌త్యేక వాహ‌నాల‌ను కూడా సిద్ధం చేశారు. వ్యాక్సిన్ అందించేందుకు ఇంజెక్ష‌న్లు, మాస్కులు, గ్లౌజులు కూడా భారీగా సిద్ధం చేసి పెట్టారు.

తెలంగాణ‌లో మొద‌టి విడ‌త‌గా 75 ల‌క్ష‌ల మందికి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సుమారు కోటి మందికి క‌రోనా వ్యాక్సిన్ అందించాల‌నే ఆలోచ‌న‌తో ప్ర‌భుత్వాలు ఉన్నాయి. ఒక్కొక్క‌రూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. రెండు డోసులు తీసుకుంటేనే వ్యాక్సిన్ వ‌ల్ల పూర్తి స్థాయి ఫ‌లితం ఉంటుంది. ఒక డోసు తీసుకున్న త‌ర్వాత 15 రోజుల నుంచి నెల రోజుల త‌ర్వాత మ‌రో డోసు తీసుకోవాల్సి ఉంటుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్‌ను బ‌ట్టి ఎన్ని రోజుల త‌ర్వాత సెకండ్ డోస్ తీసుకోవాల‌నేది ఆధార‌ప‌డి ఉంటుంది.

ప్రాధాన్య‌తాక్ర‌మంలో వ్యాక్సిన్‌ను అందించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ముందుగా క‌రోనా వారియ‌ర్స్ అయిన వైద్య సిబ్బంది, డాక్ట‌ర్లు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి వ్యాక్సిన్ అందించ‌నున్నారు. ఇదే స‌మ‌యంలో సీనియ‌ర్ సిటిజ‌న్లు, దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారికి కూడా ముందుగా వ్యాక్సిన్ అందించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇప్ప‌టికే వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభ‌మైన బ్రిట‌న్‌, ర‌ష్యాలోనూ ఇలానే చేస్తున్నారు.

క‌రోనా వారియ‌ర్స్‌ను ప్రభుత్వ‌మే గుర్తించి వారికి వ్యాక్సిన్ అందించే అవ‌కాశం ఉంది. ఇక‌, వ్యాక్సిన్ కావాలి అనుకునే 50 ఏళ్ల‌కు పైబ‌డిన వ్య‌క్తులు లేదా దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న 50 ఏళ్ల లోపు వ‌య‌స్సు ఉన్న‌వారు త‌మ పేర్ల‌ను న‌మోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గానూ ప్ర‌భుత్వం కోవిన్ అనే యాప్‌ను రూపొందించింది. కోవిన్ అంటే కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వ‌ర్క్ అని అర్థం. ప్ర‌స్తుతం ఈ యాప్‌లో రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌రోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన స‌మాచారాన్ని న‌మోదు చేస్తున్నారు.

డిసెంబ‌ర్ 20 నాటికి కోవిన్ యాప్ ప్ర‌జ‌ల‌కు కూడా అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వైద్య‌శాఖ అధికారులు చెబుతున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ కావాలి అనుకునే వారు కోవిన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకునే వివ‌రాల‌ను న‌మోదు చేయాల్సి ఉంటుంది. ఈ స‌మాచారం ఆధారంగానే క‌రోనా వ్యాక్సిన్‌ను అందిస్తారు. మొద‌ట 50 ఏళ్లు పైబ‌డిన వారు, 50 ఏళ్ల‌లోపు దీర్ఘ‌కాలిక వ్యాధిగ్ర‌స్థుల‌కు వ్యాక్సిన్ ఇస్తారు. త‌ర్వాత మిగ‌తా అంద‌రికీ వ్యాక్సిన్ అందిస్తారు. వ్యాక్సిన్‌కు డ‌బ్బు ప్ర‌జ‌లే చెల్లించాలా లేదంటే ప్ర‌భుత్వ‌మే ఉచితంగా ఇస్తుందా అనేది ఇంకా తేలాల్సి ఉంది.

Related News