logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

అంత‌ర్వేదిలో ఆందోళ‌న‌లు… ప్ర‌బ‌లిన క‌‌రోనా వైర‌స్‌..!

అంత‌ర్వేది ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యంలో ర‌థం ద‌హ‌నం ఘ‌ట‌న త‌ర్వాత త‌లెత్తిన ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా పోలీసులు క‌రోనా బారిన ప‌డ్డారు. ఆందోళ‌న‌కారుల‌ను అదుపు చేసే క్ర‌మంలో పోలీసులకు క‌రోనావైర‌స్ సోకింది. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వద్ద ఇటీవల ఆలయ రథం దగ్ధమైనప్పటి నుంచి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

హిందూ సంఘాలు, బీజేపీ, జ‌న‌సేన పార్టీలు చ‌లో అంత‌ర్వేదికి పిలుపునిచ్చాయి. నిర‌స‌న‌కారులు పెద్ద ఎత్తున ఆల‌యం వ‌ద్ద‌కు చేరేందుకు ప్ర‌య‌త్నించారు. వీరిని పోలీసులు అతిక‌ష్ట‌మ్మీద అదుపు చేయాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో పెద్ద ఎత్తున పోలీసులు క‌రోనా వైర‌స్ బారిన ప‌డ్డారు. ఏకంగా జిల్లా ఎస్పీ అద్నాన్ న‌యీం అస్మికి కూడా క‌రోనా వైర‌స్ సోకింది.

త‌‌న‌తో పాటు ‌అదనపు ఎస్పీ కరణం కుమార్‌, రాజోలు సీఐ దుర్గాశేఖర్‌రెడ్డి, 10 మంది పోలీసు సిబ్బంది వైరస్‌ బారినపడ్డట్టు జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి వెల్లడించారు. తామంతా పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలిందని, చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 850 మంది పోలీసులకు వైరస్‌ సోకినట్లు తెలిపారు.

Related News