logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

క్రికెటర్ తో సెల్ఫీ అభిమాని ప్రాణాల మీదకు తెచ్చింది..

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది ఓ అభిమాని వ్యవహారం. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎంతటి విలయాన్ని సృష్టిస్తుందో తెలిసిందే. కొందరు క్రికెటర్లు ఇప్పటికే కరోనా మహమ్మారి భారిన పడ్డారు. అందులో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హారీస్ రౌఫ్ కూడా ఉన్నాడు. అతనితో పాటు గతంలో పది మంది క్రికెటరలకు కరోనా పాజిటివ్ వచ్చింది.

వారంతా తిరిగి కోలుకుని ఎప్పటిలాగే ఉన్నారు. కానీ హారిస్ ను మాత్రం కరోనా వదలడం లేదు. ఎంతలా అంటే నెల రోజుల వ్యవధిలో హారిస్ కు 5 సార్లు కరోనా పాజిటివ్ వచ్చింది. 5వ టెస్టులో నెగిటివ్ వచ్చిన కొన్ని రోజులకే మళ్ళీ పాజిటివ్ వచ్చింది. దీంతో కరోనాను వదిలించుకోలేక ఆ క్రికెటర్ తలపట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని అత్యుత్సాహం కొంపముంచింది.

హారిస్ రౌఫ్ తో ఓ అభిమాని సెల్ఫీ తీసుకున్నాడు. ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అభిమాని షాకింగ్ విషయాన్ని తెలియజేసాడు… “నేను ఈ రోజు హరిస్ రౌఫ్‌ ను కలిసాను. అలాగే అతనితో ఓ సెల్ఫీ తీసుకున్నాను.ఆ తర్వాత అతను ఎందుకు ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లలేదా? అని గూగుల్‌లో సర్చ్ చేశా. అప్పుడు తెలిసింది.. అతనికి కరోనా పాజిటివ్ అని దానికి అతని ఇంకా చికిత్స తీసుకుంటున్నాడు అని తెలిసింది” అని పోస్ట్ చేసాడు.

హారిస్ కరోనా పాజిటివ్ వచ్చినా కోవిడ్ నిబంధనలను అతిక్రమిస్తున్నాడని అతనిపై ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఇప్పుడు మాస్కు లేకుండా అభిమానికి సెల్ఫీ ఇవ్వడంతో మరోసారి ఆ వార్తలకు బలం చేస్కురింది. అయితే ఇప్పుడు ఆ క్రికెటర్ తో సెల్ఫీ తీసుకున్న అభిమానికి మాత్రం ఆందోళన మొదలైంది.

Related News