logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

నేరుగా గుండెపైనే దాడి.. కరోనాపై షాకింగ్ పరిశోధన

కరోనా వైరస్ వెలుగుచూసిన తొలినాళ్లలో ఈ వైరస్ కేవలం శ్వాసకోశ తరహా సమస్యలకు కారణమవుతుందని అంతా భావించారు. ఆ తర్వాత ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తున్నట్టుగా గుర్తించారు. అయితే ఆ తర్వాతే ఒక్కొక్కటిగా ఈ వైరస్ గురించిన వాస్తవాలు బయటకు వచ్చాయి. కరోనా ఒక్క ఊపిరితిత్తులనే కాకుండా శరీరంలోని గుండె, మెదడు, కళ్లు, కిడ్నీలు వంటి ఇతర ముఖ్య అవయవాలను కూడా ప్రభావితం చేయగలదని నిర్దారణకు వచ్చారు.

మానవాళిని వణికిస్తన్న ఈ కరోనా మహమ్మారిపై ఇప్పటికీ అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. అయినా ఈ వైరస్ గుట్టు పూర్తిగా తెలుసుకోవడం సాధ్యపడటం లేదు. ఇప్పటివరకు కరోనా సోకితే ఊపిరితిత్తులకు ఆక్సిజన్ స్థాయిలు తగ్గి ఆ ప్రభావం గుండెపై పడుతుందని అనుకున్నారు. తాజాగా చికాగో యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనం ప్రకారం.. కరోనా నేరుగా గుండెపైనే దాడి చేస్తున్నట్టుగా తెలిపారు. రక్త నాళాలను కూడా ప్రభావితం చేయడం ద్వారా కొందరు కరోనా బాధితుల్లో రక్తం గడ్డకట్టేలా ప్రేరేపిస్తున్నట్టుగా గుర్తించారు.

ఇప్పటికే కొంతమంది కరోనా బాధితుల్లో శరీరంలోని చాలా చోట్ల రక్తం గడ్డకట్టుకుపోయిన ఆనవాళ్లను గుర్తించారు అయితే అది కరోనా వైరస్ సోకిన తర్వాత ఏర్పడ్డవా లేకా ముందునుంచే ఉన్నాయా అనే విషయంపై ఇంకా స్పష్టత రావలసి ఉంది. ఇదివరకే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు కరోనా బారిన పడితే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అలాగే వైరస్ సోకిన తర్వాత వైద్యులు ఇచ్చిన మందులను ఒక్కసారిగా ఆపివేయడం కూడా మంచిది కాదంటున్నారు.

రక్తాన్ని చిక్కబడేలా చేసే గుణం కరోనా వైర్‌సకు ఉండడంతో రక్తం సరఫరాలో ఆటంకాలు ఏర్పడి ఆకస్మాత్తుగా గుండె ఆగిపోవడం, బ్రెయిన్‌ స్ట్రోక్‌ వంటివి చోటు చేసుకోవచ్చు. మూడు నుంచి ఆరు నెలల వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉండవలసి ఉంటదని లేదంటే కొందరిలో వ్యాధి మరోసారి తిరగబెట్టే ప్రమాదం పొంచి ఉందంటున్నారు వైద్యులు. అయితే ఇప్పటివరకు రీఇన్ఫెక్షన్ కేసులు అంతగా నమోదు కావడం లేదని వంద మందిలో ఇద్దరికి మాత్రమే గుండెపోటు లక్షణాలు, ఒకరికి బ్రెయిన్ స్ట్రోక్ వంటివి తలెత్తుతున్నట్టుగా గతంలో జరిపిన అధ్యనాల్లో తేలింది.

Related News